హిందూ మతంలో గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఉంది. గ్రహణ సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటూ రకరకాల సలహాలు, సూచనలు ఇస్తారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్ 20న తొలి సూర్య గ్రహణం ఏర్పడనుంది. దాని ప్రత్యేకతలు, విశేషాలు...
భారతీయ సమాజంలో మరీ ముఖ్యంగా హిందూ మతంలో గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఉంది. హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణం అంటే చెడు సమయం.. అప్పుడు ఏ పని చేయకూడదు.. ఆహారం తీసుకోకూడదు. గ్రహణం విడిచాక.. ఇంటిని శుభ్రం చేసుకోవాలని ఇలా రకరకాల పద్దతులు పాటిస్తుంటారు. ఇక ప్రతి ఏటా సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడతాయి. వీటిల్లో కొన్ని అరుదుగా ఏర్పడే గ్రహణాలు కూడా ఉంటాయి. గ్రహణం అంటే.. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే కక్ష్యలోకి వచ్చినప్పుడు ఒకదానికి ఒకటి అడ్డు రావడం జరిగే పరిణామం. ఇక ఈ ఏడాది ఏర్పడే తొలి సూర్య గ్రహణానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ వివరాలు..
ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20వ తేదీన ఏర్పడుతుంది. సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వచ్చి సూర్యుడిని అడ్డుకోవడాన్ని సూర్యగ్రహణం అని పిలుస్తారు. ఇక ఈ సూర్యగ్రహణం వైశాఖ అమావాస్య రోజున సంభవిస్తుంది. 2023 ఏడాదిలో మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి. వీటిలో రెండు సూర్యగ్రహణాలు కాగా రెండు చంద్రగ్రహణాలు. ఇక ఏప్రిల్ 20వ తేదీన 2023 ఏడాదికి సంబంధించి మొదటి సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఇది వైశాఖ అమావాస్య రోజున ఏర్పడే ఈ సూర్యగ్రహణాన్ని హైబ్రీడ్ సూర్యగ్రహణం అంటారు.
ఇక ఈ ఏడాది ఏప్రిల్ 20న ఏర్పడే తొలి సూర్యగ్రహణం ఉదయం 7.04 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.29 నిమిషాలకు ముగుస్తుంది. మన దేశంలో మాత్రం గ్రహణం కనిపించదు. ఆస్ట్రేలియా, తూర్పు దక్షిణాసియా, పసిఫిక్ మహాసముద్రం, అంటార్కిటికా, హిందూ మహాసముద్రంలో కనిపిస్తుంది. చివరిగా ఇండోనేషియాలోని పపువా ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించనుంది. ఇక సంపూర్ణ సూర్యగ్రహణం పశ్చిమ ఆస్ట్రేలియాలోని నార్త్ వెస్ట్ కేప్‌లో మాత్రమే దర్శనమిస్తుంది.
ఈ ఏడాది ఏర్పడే తొలి సూర్యగ్రహణాన్ని హైబ్రిడ్ సూర్యగ్రహణం అంటున్నారు. అంటే ఇది అనేది పాక్షిక, సంపూర్ణ, కంకణాకార సూర్యగ్రహణాల కలయిక. ఈ గ్రహణాన్ని నిగలు సూర్యగ్రహణం, శంకర సూర్యగ్రహణం అని కూడా పిలుస్తారు. 100 ఏళ్ల తర్వాత ఈ తరహా గ్రహణం ఏర్పడుతుంది అంటున్నారు.
పాక్షిక సూర్యగ్రహణం అంటే.. చంద్రుడు సూర్యుడి.. చిన్న భాగానికి ఎదురుగా వచ్చి దానిని అడ్డుకుంటే ఏర్పడేది. ఇలా జరిగినప్పుడు కొన్ని సెకన్ల పాటు రింగ్ ఆకారం ఏర్పడుతుంది. దీనిని ‘అగ్ని జోంకా’,రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారు.
చంద్రుడు సూర్యుని మధ్యలోకి వచ్చి దాని కాంతిని అడ్డుకున్నప్పుడు, సూర్యుని చుట్టూ ఒక ప్రకాశవంతమైన కాంతి వృత్తం ఏర్పడుతుంది. దాన్ని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అంటారు.
భూమి, సూర్యుడు , చంద్రుడు ప్రత్యక్ష రేఖలో ఉన్నప్పుడు, భూమి మీద కొంత భాగం పూర్తిగా చీకటిగా మారుతుంది. ఇలాంటి సమయంలోనే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు నేరుగా చూడటం వల్ల కళ్లకు హాని జరుగుతుంది అంటారు.
ఈ ఏడాది ఏప్రిల్ 20న ఏర్పడే తొలి సూర్యగ్రహణం.. మన దేశంలో మాత్రం కనిపించదు. కనుక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుభకార్యాలపై ఈ సూర్యగ్రహణం ఎలాంటి ప్రభావం చూపదంటున్నారు. కేవలం గ్రహణం ఏర్పడటానికి ముందు నుంచి గ్రహణం ముగిసే వరకు ఉన్న సమయాన్ని అశుభమైనదిగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతారు. ఒకవేళ కాదని శుభకార్యాలు జరిపిస్తే అశుభ ఫలితాలు వస్తాయని విశ్వసిస్తారు.
ఏప్రిల్ 20వ తేదీన సంభవించే హైబ్రీడ్ సూర్యగ్రహణం తర్వాత సరిగ్గా 15 రోజులకు.. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇక రెండవ సూర్యగ్రహణం ఈ ఏడాది అక్టోబర్ 14న సంభవిస్తుంది. ఇది కూడా భారత్‌లో కనిపించదని సమాచారం. గ్రహణం యొక్క ఇరుకైన మార్గంను బట్టి దీన్ని హైబ్రిడ్ గ్రహణం అని పిలుస్తున్నారు. ఇందుకే దీన్ని అరుదైన గ్రహణంగా పరిగణిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.