అక్టోబర్ 25న పాక్షిక సూర్యగ్రహణం రాబోతున్న విషయం తెలిసిందే. 2022వ సంవత్సరంలో ఇది రెండవ గ్రహణం మాత్రమే కాకుండా ఇదే చివరిది కూడా. అంతేకాకుండా ఈసారి దీపావళి పండగ సమయంలో గ్రహణం రావడం కొన్ని చర్చలకు కూడా దారి తీసింది. ఈ సూర్యగ్రహణం ఐరోపా, పశ్చిమాసియా, ఈశాన్య ఆఫ్రికాలోని వివిధ రాష్ట్రాల్లో కనిపంచనుంది. అంతేకాకుండా భారతదేశంలోనూ పలు నగరాల్లో ఈ పాక్షిక సూర్యగ్రహణం దర్శనమివ్వనుంది. ఇండియాలోని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్ కతా, ఢిల్లీ, వారణాసి, ఉజ్జయిని వంటి నగరాల్లో కనిపించనుంది. అయితే గ్రహణం అనగానే చాలామందికి ఎన్నో అనుమానాలు, ప్రశ్నలు ఉంటాయి. ఆరోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు? అని అడుగుతుంటారు.
ముఖ్యంగా గ్రహణం సమయంలో గర్భిణీల నుంచే ఎక్కువ ప్రశ్నలు వస్తుంటాయి. ఆ రోజు గర్భిణీలు ఏం చేయాలి? ఏం చేయకూడదు అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే గ్రహణం రోజు పెద్దలు చెప్పిన ప్రకారం.. గర్భిణీలు, చిన్నపిల్లలు బయట తిరగకూడదు. అంతేకాకుండా గ్రహణం సమయంలో ఆహారం తీసుకోవడం మంచిది కాదని చెబుతుంటారు. ఈసారి గ్రహణం సాయంత్రం సమయంలో వచ్చింది కాబట్టి.. గర్భిణీలు ఆ సమయం కంటే ముందే ఆహారం తీసుకుని, 4 గంటల నుంచి 6.15 గంటల మధ్య నిద్రపోతే మంచిదని చెబుతున్నారు. అలా చేయడం వల్ల ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల నీరసం వంటివి రావని సూచిస్తున్నారు. ఈ ప్రశ్నలకు సంబంధించి లైఫ్ కోచ్, ఫ్యామిలీ కౌన్సిలర్ రమారావి చెప్పిన సమాధానాలను ఈ క్రింది వీడియోలో చూడండి.