అక్టోబర్ 25న సూర్యగ్రహణం ఏర్పడింది. దీపావళి మరుసటి రోజునే సూర్యగ్రహణం ఏర్పడటంతో.. ప్రత్యేకత సంతరించుకుంది. 22 ఏళ్ల తర్వాత వచ్చిన అరుదైన సూర్యగ్రహణంగా పేర్కొన్నారు. ఇక గ్రహణం సందర్భంగా ఆలయాలు మూసివేశారు. గ్రహణం విడిచిన తర్వాత ప్రతి ఒక్కరు ఇంటిని శుభ్రం చేసుకుని.. శుద్ధి చేసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా 15 రోజుల్లో మరో గ్రహణం ఏర్పడనుంది. నవంబర్ 8న చంద్రగ్రహణం ఏర్పడనుంది. అదే రోజు కార్తీక పౌర్ణమి కావడంతో.. ఈ గ్రహణం కూడా ప్రాధాన్యత సంతరించుకోనుంది. సంవత్సరంలో ఇది చివరి చంద్రగ్రహణం.. అది కూడా సంపూర్ణ చంద్రగ్రహణం కానుంది. నవంబర్ 8 చంద్రగ్రహణం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమై.. 6.19వరకు కొనసాగనుంది. దాదాపు గంటన్నర పాటు కొనసాగనున్న ఈ గ్రహణం.. భారత్‌తో పాటు ఉత్తర, దక్షిణ అమెరికాలు, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహా సముద్రంలో కనిపంచనుంది.
ఇక ఇదిలా ఉంటే.. 15 రోజుల వ్యవధిలో ఇలా రెండు గ్రహణాలు ఏర్పడటం మంచిదేనా.. దీనివల్ల ఎలాంటి ఫలితాలు ఏర్పడనున్నాయి అనే అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. ఈ క్రమంలో జ్యోతిష్య నిపుణులు.. 15 రోజుల వ్యవధిలో రెండు గ్రహణాలు ఏర్పడటం వల్ల ప్రపంచం మీద చెడు ప్రభావం పడుతుందని అంటున్నారు. ఇంత తక్కువ వ్యవధిలో రెండు గ్రహణాలు ఏర్పడటం వల్ల.. ప్రకృతి వైపరిత్యాలు సంభవించవచ్చు.. లేదంటే.. వాతావరణంలో ఆకస్మిక మార్పులు సంభవించవచ్చని చెబుతున్నారు. ఫలితంగా దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. అభివృద్ధి మందగించడమే కాక.. వ్యాపార తరగతి ప్రజల్లో ఆందోళన పెరుగుతుందని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఇక హిందూ పురాణాల ప్రకారం.. గ్రహణం అనేది మన జీవితాలపై చాలా ప్రతికూల ప్రభావాలు చూపిస్తుందని చెబుతున్నాయి. ఇక గ్రహణ ప్రభావం వల్ల ఏర్పడే చెడు ఫలితాల నుంచి బయటపడేందుకు అనేక నివారణలు సూచించారు. మరీ ముఖ్యంగా గ్రహణ సమయంలో ఆలయాలు మూసివేస్తారు.. ఆ సమయంలో భోజనం చేయరు.. గ్రహణం విడిచాక.. శుద్ధి చేసుకుని.. పూజ చేసి.. ఆ తర్వాత వంట చేస్తారు.