MahaShivaratri 2023 Fasting Time in Telugu: మహా శివరాత్రి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఉపవాసం, జాగారాలే. అయితే చాలా మందికి ఉపవాసం ఏ టైమ్ కు ప్రారంభించాలి, ఏ టైమ్ కి ముగించాలో తెలీదు. ఈ క్రమంలోనే ఉపవాస నియమాలు, సమయాల గురించి ప్రముఖ పండితులు చెప్పుకొచ్చారు. మహాశివరాత్రి ఉపవాస సమయాలు, నియమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భారతీయ సనాతన సంప్రదాయంలో పండుగలకు ఉన్న విశిష్టతే వేరు. అందులోనూ హిందూ సనాతన ధర్మంలో అత్యంత ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. దాంతో ఈ రోజున అత్యంత భక్తి శ్రద్దలతో ఆ పరమ శివుడిని ఆరాధిస్తే.. కోరిన కోర్కెలు అన్నీ తీరుతాయని పండితులు చెబుతున్నారు. అయితే ఈ ఏడాది శివరాత్రి.. శనివారం నాడు.. అందునా శనిత్రయోదశి రోజున వస్తుంది. దాంతో ఈసారి శివరాత్రి విశిష్టమైనదిగా చెబుతున్నారు. ఇక మహా శివరాత్రి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఉపవాసం, జాగారాలే. అయితే చాలా మందికి ఉపవాసం ఏ టైమ్ కు ప్రారంభించాలి, ఏ టైమ్ కి ముగించాలో తెలీదు. ఈ క్రమంలోనే ఉపవాస నియమాలు, సమయాల గురించి ప్రముఖ పండితులు చెప్పుకొచ్చారు. మహాశివరాత్రి ఉపవాస సమయాలు, నియమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మహాశివరాత్రి.. ఫిబ్రవరి 18 శనివారం నాడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే పండుగ. ఈ రోజున ఆ పరమ శివుడిని నీతి నియమాలతో, అత్యంత భక్తి శ్రద్దలతో కొలుస్తారు. ఇక మనకు మహా శివరాత్రి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఉపవాసమే. అయితే చాలా మందిలో శివ రాత్రికి ఉపవాసం ఏ సమయంలో చెయ్యాలి, వాటి నియమాలు ఏంటో తెలీక అయోమయానికి గురౌతుంటారు. ఈ క్రమంలోనే శివ రాత్రికి ఏ సమయంలో ఉపవాసం ప్రారంభించాలి, ముగించాలో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగానే శివరాత్రి రోజున ఉదయం సూర్యోదయం కాక ముందే ఉపవాసం ప్రారంభించాలి. అప్పుడు ప్రారంభం అయిన ఉపవాసం మరుసటి రోజు తెల్లవారు జాము వరకు పాటించాలి. అయితే ఈ ఉపవాసంతో పాటుగా మహా శివరాత్రి రోజున శివుడిని నాలుగు దశల్లో పూజించాలని చెబుతున్నారు పండితులు. అలా చేస్తేనే ఆ పరమ శివుడి అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు. ఇప్పుడు ఆ నాలుగు దశల పూజల గురించి తెలుసుకుందాం. మెుదటి ప్రహర పూజ సమయం ఉదయం 06:40 ప్రారంభించి 9:47 వరకు చెయ్యాలని. ఇక రెండవ ప్రహర పూజా సమయం 9:47 నుంచి 12:53 వరకు కొనసాగించాలని పండితులు చెబుతున్నారు. అనంతరం మూడవ ప్రహర పూజా సమయం 12:53 నుంచి 4:00 వరకు చెయ్యాలి.
ఇది కూడా చదవండి: శివరాత్రికి ఉపవాసం ఉంటున్నారా? మొత్తం నియమాలు ఇవే!
ఇక చివరిగా నాలుగవ పూజను 4:00 నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించాలని పండితులు చెప్పుకొచ్చారు. ఈ పూజలన్నింటిలో ఆ శివుడి నామ స్మరణమే జపించాలి. ఇక శివ రాత్రి నాడు రాత్రి సమయాల్లో భక్తులు శివుని స్తోత్రాలు ఆలపించి, శివ లింగాలకు అభిషేకాలు చేస్తారు. ఇక నియామాల విషయానికి వస్తే.. ఉదయాన్నే చన్నీటి స్నానాలు ఆచరించి నీతి నియమాలతో ఎలాంటి తప్పులు చెయ్యకుండా చెయ్యాలని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ రోజున ఎలాంటి మాంసాహారం ముట్టుకోకూడదు. కఠినమైన భక్తి శ్రద్దలతో ఆ పరమ శివుడిని ఆరాధిస్తేనే.. తీరని కోర్కెలు తీరుతాయని మహా పండితులు పేర్కొంటున్నారు.