ఈ యువతి పేరు అనూష. కడప జిల్లాకు చెందిన ఈ యువతి కాలేజీకి వెళ్తున్నాని ఇంట్లో చెప్పి వెళ్లింది. సాయంత్రం అయినా కూతురు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రుల కన్నీరుగా మున్నీరుగా విలపించారు. ఇక మరుసటి రోజు అసలు విషయం తెలిసి ఆ యువతి కుటుంభికుల కంట కన్నీరు ఆగడం లేదు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది వైఎస్సార్ కడప జిల్లా బీకోడూరు మండలం వరాటిపల్లి ప్రాంతం. ఇక్కడే తల్లిదండ్రులతో పాటు అనూష అనే యువతి నివాసం ఉంటూ స్థానికంగా డిగ్రీ చదువుతోంది.
అనూష చదువుల్లో రాణిస్తూ అన్నిట్లో ముందుండేది. అయితే ఈ క్రమంలోనే గత గురువారం ఉదయం అనూష కాలేజీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. ఇక సాయంత్రం అయినా కూతురు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు అక్కడక్కడ వెతికారు, బందువులకు ఫోన్ చేసి తెలుసుకున్నారు. కానీ ఫలితం మాత్రం దక్కలేదు. దీంతో ఖంగారుపడ్డ అనూష తల్లిండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే గత మూడు రోజుల నుంచి పోలీసులు గాలిస్తున్న యువతి అనూష ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక మా కూతురు ఏమై పోయిందో అంటూ అనూష తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఇకపోతే గత వారం రోజుల నుంచి బద్వెల్ లో ఇప్పటికీ ముగ్గురు విద్యార్థులు అదృష్యమయ్యారు. దీంతో స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసులు అన్ని కోణాల్లో విచారించి గాలిస్తున్నా.. విద్యార్థుల ఆచూకి దొరకకపోవడంతో పోలీసులు తలల పట్టుకుంటున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.