హైదరాబాద్ నగరంలో మద్యం సేవించి వాహనాలు నడపడం, ప్రమాదాలు చేయడం ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మద్యం సేవించి బండి నడిపే వ్యక్తి ఉగ్రవాదితో సమానం అని పోలీసులు చెప్తున్నా, కౌన్సిలింగ్, కఠిన శిక్షలు, ఫైన్లు వేస్తున్నా మందుబాబులకు మాత్రం కళ్లెం వేయలేక పోతున్నారు. ఎక్కడో ఒకచోట మద్యం తాగి వీరంగం వేస్తూనే ఉన్నారు. తాజాగా ఇద్దరు యువకులు పూటుగా మందు తాగి ఓ బైకును ఢీకొట్టారు. అక్కడితో ఆగకుండా అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులకు సైతం రివర్స్ లో వార్నింగ్ ఇచ్చారు. అతి బలవంతం మీద వారిని పోలీసులు కారులో ఎక్కించి పీఎస్ కు తరలించారు.
ఇదీ చదవండి: పోలీసులకి తలనొప్పిగా మారిన తాగుబోతు! ఇతను తాగితే ఇక అంతే..!
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరం కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఇద్దరు యువకులు బైక్ ను ఢీకొట్టారు. అడ్డుకున్న స్థానికులు వారు మద్యం మత్తులో గుర్తంచి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో విజయ్, సూర్య అనే ఇద్దరు యువకులకు గాయాలవ్వగా.. వారిని స్థానికి ఆస్పత్రికి తరలించారు. ఇంక ఈ ఘటనలో ఇద్దరు నిందితులు కొత్తపేటకు చెందిన లోహిత్, కొండాపూర్ కు చెందిన నిహాల్ రెడ్డిగా గుర్తించారు. వీరు ఇటీవలే అమెరికాలో బీటెక్ పూర్తిచేసుకుని హైదరాబాద్ వచ్చారన్నారు.లోహిత్, నిహాల్ ఇద్దరు మిత్రులు గురువారం జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ లో పూటుగా మద్యం సేవించారు. తాగిన తర్వాత కొండాపూర్ లోని లోహిత్ ఇంటికి వెళ్తుండగా మార్గం మధ్యలో బైక్ ను ఢీకొట్టారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులపై సైతం ఈ యువకులు చిందులు తొక్కారు. డ్యూటీలో ఉన్న పోలీసులకు వార్నింగ్ కూడా ఇచ్చారు. నేమ్ ప్లేట్ చూస్తూ మా పేర్లు బయటకు వస్తే.. మీ పేర్లు కూడా వస్తాయంటూ వార్నింగ్ ఇచ్చారు. పోలీసుల కారులో ఎక్కేందుకు నిరాకరించడంతో.. బలవంతంగా ఎక్కించి పీఎస్ కు తరలించారు. ఈ ఘటనలో ప్రమాదానికి కారణమైన కొత్త బీఎండబ్ల్యూ కారుకు MP స్టిక్కర్ ఉండటం పెద్ద చర్చకు తావిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యువకులు మద్యంతోపాటు మత్తు పదార్థాలు కూడా తీసుకున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.