విశాఖ జిల్లాలోని పెదగంట్యాడ మండలానికి చెందిన ఓ యువతి ఈ నెల 8న పుట్టిన రోజు కావడంతో ఎంజాయ్ చేయాలనుకుంది. ఇందులో భాగంగానే తల్లిదండ్రులకు బయటకు వెళ్లొస్తానని చెప్పి వెళ్లింది. ఇక సాయంత్రం అయిన ఇంటికి రాకపోవడతో తల్లిదండ్రులు అంతటా వెతికారు. ఎంతకు కూడా ఆ యువతి జాడ కనిపించలేదు. బంధువుల ఇళ్లల్లో కూడా అడిగి తెలుసుకున్నారు. అయినా కూడా ఆ యువతి ఆచూకి కనిపించలేదు. ఇక ఆ యువతి తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాక వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తమ కూతురు పుట్టిన రోజు నాడే కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పుట్టెడు శోకంతో కన్నీటి సంద్రంలో మునిగితేలుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. పుట్టిన రోజు నాడే యువతి కనిపించకుండా పోయిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.