పాంషావలి ఫ్యాక్టరీలో పని చేస్తుండగా ఓ వీధి కుక్క అతడిపై దాడి చేసింది. ఆ కుక్క దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు అతడ్ని పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. రంజాన్ రోజున..
దేశ వ్యాప్తంగా వీధి కుక్కలు పెచ్చి మీరి విలయతాండవం చేస్తున్నాయి. కుక్కల దాడి ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఓ చోట జనం కుక్కల దాడికి గురవుతున్నారు. రంజాన్ పండుగ వేళ ఓ కుక్క కారణంగా విషాదం చోటుచేసుకుంది. కుక్క దాడిలో గాయపడ్డ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
ఉమ్మడి కర్నూలు జిల్లా బేతంచెర్ల పట్టణానికి చెందిన ఎస్ చిన్న పాంషావలి భార్య ఉమ్మికులం, ఇద్దరు పిల్లలతో కలిసి సంజీవ్ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో ఉంటున్నాడు. పాంషావలి పట్టణానికి సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. ఈ నెల 4న ఫ్యాక్టరీలో ఉండగా ఓ వీధి కుక్క ఒకటి అతడిపై దాడి చేసి కరిచింది. పాంషావలి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడ్ని కర్నూలు పెద్దాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రంజాన్ రోజున పాంషావలి చనిపోయాడు.
పాంషావలి మరణంతో కుటుంబం మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఉమ్మికులం ప్రస్తుతం గర్భవతి, ఆమె బాధకు హద్దలు లేకుండా పోయాయి. ఇక, పెద్దాస్పత్రికి ప్రతిరోజు జిల్లా నలుమూలల నుండి కుక్కకాటుకు గురైన వారు పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు. కుక్కల బారినుంచి తమను రక్షించమని ప్రజలను అధికారులను వేడుకొంటున్నారు. మరి, కుక్క కాటు కారణంగా యువకుడు మృతి చెందిన ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.