Whatsapp: ప్రియుడు తనను వాట్సాప్‌లో బ్లాక్ చేశాడన్న మనోవేదనతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఓ చిన్న వివాదం కాస్తా ప్రాణాలు తీసుకునే స్థాయికి దారి తీసింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబైకి చెందిన ప్రణాలి లోకరే అదే ప్రాంతానికి చెందిన ఓ అబ్బాయితో ప్రేమలో ఉంది. వీళ్లు గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఎన్ని పెద్ద పెద్ద గొడవలు వచ్చినా వెంటనే కలిసిపోయేవారు. ఆదివారం ఇద్దరూ కలిసి ఓ పెళ్లికి వెళ్లారు. పెళ్లి అయిపోగానే అక్కడినుంచి బయటకు వచ్చారు.
ఈ నేపథ్యంలో ప్రణాలి తాను ప్రియుడితోటే ఉంటానని, రాత్రి అతడి ఇంట్లోనే పడుకుంటానని అంది. దీనికి ఆమె ప్రియుడు ఒప్పుకోలేదు. ఇంటికి వెళ్లిపోమ్మని చెప్పాడు. దీంతో ఆమె అక్కడినుంచి వెళ్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత ప్రియుడికి ఫోన్‌ల మీద ఫోన్లు చేస్తూ.. ఇంటికి వస్తానని ప్రాథేయపడసాగింది. అయినప్పటికి అతడు ఒప్పుకోలేదు. కొద్ది సేపటి తర్వాత ఆమె వాట్సాప్ అకౌంట్‌ను అతడు బ్లాక్ చేశాడు. దీంతో ఆమె కోపంగా అతడి ఇంటికి వెళ్లింది. దీని గురించి అతడ్ని ప్రశ్నించింది. ఇద్దరి మధ్యా వాగ్వివాదం చోటుచేసుకుంది.
అనంతరం ప్రణాలిని ఇంట్లో ఉండటానికి అతడు ఒప్పుకున్నాడు. అయితే, ప్రియుడు తనను వాట్సాప్‌లో బ్లాక్ చేశాడని ఆమె ఆవేదన చెందింది. అర్థరాత్రి తన దుపట్టాతో ఇంటి సీలింగ్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం గదిలోకి వెళ్లిన అతడికి ప్రియురాలు ఉరికి వేలాడుతూ కనిపించింది. అతడు షాక్ తిన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Kukatpally: పెళ్లి కావట్లేదని మనస్థాపంతో యువతి బలవన్మరణం!