ఈ మధ్యకాలంలో కొందరు దుర్మార్గులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. కట్టుకున్న భార్య అన్న కనికరం లేకుండా దారుణాలకు తెగబడుతున్నారు. అచ్చం ఇలాగే హద్దులు దాటిన ఓ భర్త కటింగ్ ప్లేయర్ తో భార్యపై ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ చెన్నారావుపేట మండలం అమీనాబాద్. ఇదే ప్రాంతంలో జన్ను నరేష్, అరుణ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందట వివాహం జరిగింది.
పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే జీవించారు. అయితే ఈ మధ్య కాలం నుంచి భర్త నరేష్ దుర్మార్గుడిలా ప్రవర్తిస్తున్నాడు. కట్టుకున్న భార్యను అనుమానంతో తీవ్ర వేధింపులకు పాల్పడ్డాడు. అయితే భార్య అరుణ డ్యూటీ నిమిత్తం బయటకు వెళ్లడంతో నువ్వు ఎవరితో తిరుగుతున్నావు అంటూ వేధించడం మొదలు పెట్టాడు. ఇదే కారణంతో భార్యాభర్తల మధ్య తరుచు గొడవలు జరిగాయి. అయితే ఇదే విషయమై భార్యాభర్తల మధ్య ఇటీవల మరోసారి గొడవ జరిగింది.
కోపంతో ఊగిపోయిన భర్త ఇంట్లో ఉన్న కటింగ్ ప్లేయర్ తో భార్య తలపై బలంగా బాదాడు. ఈ దాడిలో భార్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అరుణ చనిపోయిందని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. అనంతరం ఈ దారుణపై అరుణ కుటుంబ సభ్యులు భర్త తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.