ఈ రోజుల్లో చాలా మంది యువత తెలిసి తెలియక చిన్న వయసులోనే చెడు మార్గాల్లో అడుగులు వేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా తమ వ్యక్తి గత సుఖాల కోసం కన్నవాళ్లని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అచ్చం ఇలాంటి చెడు మార్గాల్లోనే అడుగులు వేసిన ఓ యువకుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటనతో ఆ యువకుడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అసలేం జరిగిందంటే? తమిళనాడు తిరుచ్చి జిల్లాలోని మలైయాండిపట్టికి చెందిన సంతోష్(22) అనే యువకుడు స్థానికంగా ఓ బీటెక్ కాలేజీలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.
అయితే మొదట్లో బాగానే చదువుకున్న సంతోష్ రాను రాను చెడు మార్గాల్లో పయనిస్తూ ఆన్ లైన్ రమ్మీకి అలవాటుపడ్డాడు. దానికి బానిసైన సంతోష్ ఉన్న డబ్బులన్నీ ఆన్ లైన్ రమ్మీలో పెడుతూ బాగా నష్టాపోయాడు. ఇక డబ్బులు లేకపోతే తల్లిదండ్రులను బెదిరించి మరీ తీసుకుని ఆన్ లైన్ రమ్మీలో పెట్టేవాడు. సంతోష్ అలా ఆన్ లైన్ రమ్మీ వ్యసనానికి బానిసై జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకున్నాడు. అయితే ఇటీవల సంతోష్ అవసరం ఉందంటూ తల్లిదండ్రుల వద్ద కొంత డబ్బు, ఓ బంగారు ఉంగరాన్ని తీసుకెళ్లాడు. వాటిని అమ్మి ఆన్ లైన్ రమ్మీలో పెట్టాడు.
దీంతో మళ్లీ నష్టపోయిన సంతోష్ తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. ఇక ఏం చేయాలో తెలియక.. నా చావుకి ఆన్ లైన్ రమ్మీ కారణం. దీనికి బానిసై చాలా నష్టపోయానని, అందుకే చనిపోతున్నానంటూ సంతోష్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిని గమనించిన స్థానికులు సంతోష్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కుమారుడి మరణవార్త తెలుసుకున్న సంతోష్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.