విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన ప్రాణ స్నేహితుడిగా ఉన్న యువకుడిని వాలంటీర్ గా పని చేస్తున్నమరో స్నేహితుడు దారుణంగా హత్య చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ప్రాణ స్నేహితుడినిగా ఉన్న ఆ యువకుడిని వాలంటీర్ ఎందుకు హత్య చేశాడు? హత్యకు గల కారణాలు తెలియాలంటే ఈ స్టోరీ తప్పక చదవాల్సిందే. పోలీసుల కథనం ప్రకారం.. విజయనగరం పట్టణం పరిధిలోని బీసీ కాలనీకి చెందిన బ్రహ్మాజీ అనే యువకుడు డిగ్రీ పూర్తి చేసి స్థానికంగా వాలంటీర్ గా పని చేస్తున్నాడు. ఇతనికి నవీన్ (19) అనే స్నేహితుడు ఉన్నాడు. ఈ యువకుడు ప్రస్తుతం డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు.
అయితే వాలంటీర్ గా పని చేస్తున్న బ్రహ్మాజీ స్థానికంగా ఉండే ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. దీంతో ప్రతీ రోజు ఆ యువతితో మాట్లాడుతుండేవాడు. కాగా బ్రహ్మాజీ అప్పడప్పుడు నవీన్ ఫోన్ తీసుకుని తన ప్రియురాలితో మాట్లాడుతుండేవాడు. అలా కొంత కాలం పాటు బ్రహ్మాజీ తన ప్రేమ వ్యవహారాన్ని నడిపిస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే నవీన్ బ్రహ్మజీ ప్రియురాలితో మెల్లగా మాట్లాడడం మొదలు పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మాజీ నవీన్ పై కోపంతో ఊగిపోయాడు. ఎలాగైన నవీన్ ను చంపాలని అనుకున్నాడు. ఇక ఇందులో భాగంగానే బ్రహ్మాజీ ఈ నెల 24న నవీన్ కు ఫోన్ చేసి మద్యం తాగుదామంటూ నమ్మించి తీసుకెళ్లాడు. దీంతో ఇద్దరు ఫుల్ గా తాగారు. నవీన్ జోరు మత్తులోకి జారుకున్నాడు. ఇక ఇదే మంచి సమయం అనుకున్న బ్రహ్మాజీ.. నా ప్రియురాలితో ఎందుకు మాట్లాడుతున్నావని ప్రశ్నించాడు.
నువ్వు ఎంతోమంది అమ్మాయిల, మహిళల జీవితాన్ని నాశనం చేస్తున్న దానితో పోలిస్తే.., నేను చేసేది అంత పెద్ద తప్పేం కాదు అని బ్రహ్మాజీ మీదకు నవీన్ ఎదురుదాడికి దిగాడు. ఇక ఇదే విషయమై ఆ స్నేహితుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కోపంతో ఊగిపోయిన బ్రహ్మాజీ కర్రతో నవీన్ తలపై బలంగా బాదాడు. ఈ దాడిలో నవీన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం నవీన్ చనిపోయాడని నిర్ధారించుకున్న బ్రహ్మాజీ.. నవీన్ ది రైలు ప్రమాదంగా చిత్రీకరించేందుకు అతడి శవాన్ని రైలు పట్టాలపై ఉంచి అక్కడి నుంచి పరారయ్యాడు.
ఇక నవీన్ రైలు పట్టాలపై శవమై తేలడంతో నవీన్ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నాడేమనని భావించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు ఎంటరయ్యారు. నవీన్ ది హత్య కావచ్చు అని పోలీసులు అనుమానించారు. దీంతో వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇక ముందుగా అతని ఫ్రెండ్ అయిన బ్రహ్మాజీని పోలీసులు విచారించారు. మొదట్లో పొంతనలేని సమాధానాలు చెప్పిన బ్రహ్మాజీ.. చివరికి అసలు నిజాన్ని బయటపెట్టాడు. అనంతరం పోలీసులు అతనిని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతుంది.