విశాఖపట్నానికి చెందిన తనూజకు గతంలో చందర్లపాడు మండలం మునగాల పల్లి గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. దీంతో కొంత కాలం పాటు ఇద్దరు భార్యాభర్తలు వైవాహిక బంధాన్ని గడిపారు. సాఫీగా సాగిపోతున్న వీరి కాపురంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో తనుజ మొదటి భర్తకు విడాకులిచ్చింది. దీంతో ఆమె అప్పటి నుంచి ఒంటరి జీవితాన్ని గడిపింది.
అయితే 2015లో నందిగామ పట్టణానికి చెందిన షేక్ ఖాదర్‌వలి బాషాను అనే వ్యక్తి తనుజకు పరిచయమయ్యాడు. దీంతో ఇద్దరు కొన్నాళ్లకి పెళ్లి కూడా చేసుకున్నారు. అప్పటి నుంచి ఆ మహిళ తనుజ పేరును కాస్త ఫరహాన ఫాతిమాగా మార్చుకుంది. పట్టణ శివారు డీవీఆర్ కాలనీలో ఫాతిమా భర్తతో కలిసి నివసిస్తోంది. భర్త ఓ ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్‌లో డ్రైవర్‌గా పని చేస్తుండడంతో వీరిద్దరి కాపురం సంతోషంగానే సాగుతూ ఉంది.
ఇది కూడా చదవండి: Siddipet: ఐదేళ్ల కిత్రం ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఏళ్లు గడిచినా సంతానం కలగలేదని!
అయితే ఈ క్రమంలోనే వారికి ఇద్దరు పిల్లలు జన్మించారు. ఫాతిమా రెండో పెళ్లి చేసుకుందని తల్లిదండ్రులు ఆమెతో మాట్లాడడం లేదు. ఇదే బాధ ఆమెను వెంటాడుతూనే ఉంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఫాతిమా (తనూజ) (35) బుధవారం ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.