ఇతగాడి పేరు రాథోడ్ శంకర్ నాయక్. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ పరిధిలోని నంద్యానాయక్ తండా గ్రామ సర్పంచ్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే సర్పంచ్ గా గ్రామంలోని ప్రజలకు మంచి చేయాల్సిన ఈ దుర్మార్గుడు పాడు పనులకు శ్రీకారం చుట్టాడు. తన ఇంటి పక్కనే ఉన్న ఓ యువతి (21) పై సర్పంచ్ శంకర్ నాయక్ కన్నేశాడు. తాగిన మత్తులో ఏం చేస్తున్నాడో అర్థం కానీ ఈ దుర్మార్గుడు ఆ యువతితో కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. అయితే దసరా పండగా సందర్భంగా ఆ యువతి తల్లిదండ్రులు హైదరాబాద్ బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే మంచి సమయం అనుకున్న ఈ దుర్మార్గుడు రెచ్చిపోయాడు.
కాగా శుక్రవారం రాత్రి శంకర్ నాయక్ ఫుల్ గా తాగి కళ్లునెత్తికి ఎక్కడంతో దారుణానికి పాల్పడ్డాడు. అదే రోజు రాత్రి సర్పంచ్ శంకర్ నాయక్ ఆ యువతిని నమ్మించి ఇంటి మేడపైకి తీసుకెళ్లాడు. అనంతరం ఈ దుర్మార్గుడు ఆ యువతిపై అత్యాచారం చేశాడు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు మేడపైకి వెళ్లి చూడగా పాడు పని చేస్తూ వారి కంటపడ్డాడు. దీంతో కోపంతో ఊగిపోయిన స్థానికులు శంకర్ నాయక్ పై దాడి చేశారు. అనంతరం ఈ దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శంకర్ నాయక్ ను అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.