క్షణికావేశంలో కొందరు దంపతులు దేనికైన తెగిస్తున్నారు. భర్త కొత్త చీర కొనివ్వలేదని, భార్య చెప్పిన మాట వినలేదనే కారణాలతో హత్యలు చేయడం, లేదంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే అచ్చం ఇలాగే క్షణికావేశంలో ఓ భార్య భర్తను గొడ్డలితో దారుణంగా హత్య చేసింది. ఇటీవల వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అది శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం చెట్లతాండ. ఇదే గ్రామంలో పొన్నాడ రాంబాబు, వరలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు.
వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. ఇక స్థానికంగా కూలీ పనులు చేస్తూ ఈ దంపతులిద్దరూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే గత కొన్నేళ్ల నుంచి భర్త రాంబాబు మద్యానికి బానిసయ్యాడు. రోజూ రాత్రి మద్యం సేవించి ఇంటికొచ్చి గొడవలు చేస్తున్నాడు. దీంతో భార్య వరలక్ష్మి మద్యం తాగుడు మానేయ్యాలని భర్తకు అనేక సార్లు నచ్చచెప్పింది. కానీ భర్త భార్య మాటను అస్సలు లెక్కచేయకుండా రోజు మద్యం తాగుతుండేవాడు. ఇక ఎప్పటిలాగే భర్త రాంబాబు ఇటీవల కూడా మరోసారి మద్యం సేవించి ఇంటికొచ్చాడు.
ఇదే విషయమై భార్యాభర్తల మధ్య గొడవ కూడా జరిగింది. ఇక తాగొద్దని చెప్పినా కూడా భర్త అలాగే రోజు తాగి వస్తుండడంతో భార్య వరలక్ష్మి విసిగిపోయింది. దీంతో భర్తతో గొడవకు దిగింది. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. కోపంతో ఊగిపోయిన భార్య వరలక్ష్మి ఊహించిన దారుణానికి పాల్పడింది. క్షణికావేశంలో ఇంట్లో ఉన్న గొడ్డలితో భర్త రాంబాబును దారుణంగా హత్య చేసింది. ఈ విషయం చివరికి పోలీసుల వరకు వెళ్లడంతో ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్నిపరిశీలించారు. అనంతరం ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు నిందితురాలు వరలక్ష్మిని అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.