వారిద్దిరూ భార్యాభర్తలు. వీరికి పెళ్లై 9 ఏళ్లు అవుతుంది. వివాహం జరిగిన నాటి నుంచి ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగా సాగుతూ వస్తుంది. కానీ పిల్లలు కలగలేదన్న బాధ మాత్రం ఆ దంపతులను వెంటాడుతూనే ఉంది. పిల్లలు లేరా అంటూ.. సూదుల్లా గుచ్చుతున్న ఎదుటివారి సూటి పోటి మాటలతో తట్టుకోలేక ఆ దంపతులు ఎన్నో దేవుళ్లు, ఆస్పత్రుల చుట్టు చెప్పులు అరిగేలా తిరిగారు. అయినా చివరికి ఈ దంపతులకు పిల్లలు మాత్రం కలగలేదు. ఇలా నిరాశలో ఉన్న క్రమంలోనే భర్త ఓ సరికొత్త ప్రయోగం చేయబోయాడు. చివరికి ఆ ప్రయోగం బెడిసికొట్టడంతో ఆ దంపతులు నెత్తినోరు బాదుకుంటున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
అసలు ఈ ఘటన ఎక్కడ ఏం జరిగింది? చివరికి సారిగా భర్త చేసిన ఆ ప్రయోగం ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ప్రాంతం. ఇక్కడే రాణి మహిళ భర్తతో పాటు నివాసం ఉంటుంది. వీరికి పెళ్లై 9 ఏళ్లు గడుస్తున్నా ఇంకా పిల్లలు కలగలేదు. దీంతో విసుగి చెందిన భార్యాభర్తలకు ఇటీవల ఓ మహిళ సలహా ఇచ్చింది. అదేంటంటే? నాకు ఓ తాంత్రికుడు తెలుసని, అతనితో పూజలు చేయించుకుంటే ఖచ్చితంగా మీకు పిల్లలు పుడతారని చెప్పింది. ఆమె మాటలను నమ్మిని రాణి భర్త సరేనంటూ దసరా రోజు ఆ తాంత్రికుడితో వీరి ఇంట్లో పూజలు చేయించుకున్నారు.
అయితే పూజ సమయంలో ఆ తాంత్రికుడు ఎక్కువ మొత్తంలో డబ్బు నా ముందు ఉంచాలని చెప్పాడు. ఆ తాంత్రికుడి మాటలు నమ్మిన రాణి భర్త అతను చెప్పినట్టే దాదాపుగా రూ.8 లక్షల వరకు అతని ముందు ఉంచాడు. ఆ రోజు రాత్రి ఆ తాంత్రికుడు గంట పాటు పూజలు చేశాడు. ఆ దంపతుల నుదిటిపై బుట్టు పెట్టి కొద్దిసేపు ఇంటి బయట కూర్చోవాలని చెప్పాడు. అతని మాయమాటలు నమ్మిన ఆ దంపతులు అతగాడు చెప్పినట్టే చాలా సేపు బయట కూర్చుకున్నారు.
ఇక ఆ తాంత్రికుడు ఎంతసేపైన ఆ దంపతులను పిలవకపోవడంతో తాంత్రికుడిపై వారికి అనుమానం కలిగింది. వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా ఊహించని షాక్ తిన్నారు. వారి ముందు ఉంచిన రూ.8 లక్షలతో పాటు ఇంట్లో ఉన్న బంగారు అభరణాలు సైతం ఆ తాంత్రికుడు దోచుకెళ్లారు. ఇక మోసపోయామని గ్రహించిన ఆ దంపతులు ఏడుస్తూ నెత్తినోరు బాదుకున్నారు. ఇక చేసేదేం లేక చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.