పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు సునీత. వయసు 25 ఏళ్లు. సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద మండలం ఇరక్ పల్లికి చెందిన సునీల్ (30) అనే వ్యక్తితో సునీతకు గతంలో పెళ్లి జరిగింది. పెళ్లైన నాటి నుంచి వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అయితే ఈ దంపతులు ఇద్దరు కూలీ పనులు చేసుకుంటూ సంసారాన్ని నెట్టుకొస్తున్నారు. పెళ్లైన నాటి నుంచి వీరిద్దరూ గొడవలు పడ్డ దాఖలాలు కూడా లేవు. అలా ఎంతో సంతోషంగా సాగుతున్న వీరి కాపురంలో ఉన్నట్టుండి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
అసలేం జరిగిందనే కదా మీ ప్రశ్న. ఇక స్టోరీలోకి వెళ్తే.. సెప్టెంబర్ 27 సాయంత్రం 7 గంటల ప్రాంతంలో సునీత నారాయణ్ ఖేడ్ లో ఓ అపరిచితుడితో ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆ రోజు రాత్రి నుంచి సునీత ఇంటికి రాకపోవడంతో భర్త ఖంగారుపడ్డాడు. బంధువులకు ఫోన్ చేసి సునీత జాడను అడిగి తెలుసుకున్నాడు. అయినా భార్య ఆచూకి దొరకలేదు. ఇక ఏం చేయాలో తెలియని భర్త సునీల్.., నా భార్య కనిపించడం లేదంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
భర్త సునీల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. సునీతను ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి కిడ్నాప్ చేశాడా? లేక మరేమైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఉన్నట్టుండి సునీత కనిపించకుండా పోవడంతో ఆమె భర్త, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.