ఈ యువతి పేరు మహేశ్వరి. వయసు 19 ఏళ్లు. తండ్రి గతంలోనే మరణించడంతో యువతి పరిగిలోని ఓ కాలేజీలో అక్కడే ఉండి చదువుకుంటుంది. అయితే మహేశ్వరి దసరా సెలవులు అని ఇంటికి వచ్చింది. ఇక హోటల్ నడిపిస్తున్న తల్లికి సాయంగా ఉందామని హోటల్ లో పని చేస్తూ ఉండేది. కాగా ఈ నెల 9న ఉదయాన్నే హోటల్ తెరిచేందుకు వెళ్తున్నానని తల్లికి చెప్పి వెళ్లింది. చాలా సేపు అయిన కూతురు ఇంటికి రాలేదు. దీంతో ఆ తల్లి హోటల్ కు వెళ్లి చూడగా అక్కడ జరిగింది చూసి ఒక్కసారిగా తల్లడిల్లిపోయింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది వికారాబాద్ జిల్లాలోని దోమ ప్రాంతం. ఇక్కడే ఇడిగి అనసూయ (48) అనే వివాహిత నివాసం ఉంటుంది. ఆమెకు ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. అయితే అనసూయ భర్త గతంలోనే మరణించడంతో స్థానికంగా హోటల్ ను నడిపిస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఆమె చిన్న కూతురే మహేశ్వరి. పరిగిలో చదువుకుంటున్న ఈ యువతి దసరా సెలవులు కావడంతో ఇంటికి వచ్చింది. ఆ తర్వాత హోటల్ ను నడిపిస్తున్న తల్లికి కూతురు మహేశ్వరి చేదోడు వాదోడుగా నిలిచింది. అయితే ఈ క్రమంలోనే ఈ నెల 9న ఉదయం హోటల్ తెరుస్తానని తల్లికి చెప్పి రాజేశ్వరి వెళ్లింది.
ఇక ఎంత సేపు అయినా కూతురు ఇంటికి రాకపోవడంతో తల్లికి హోటల్ కు వెళ్లింది. కానీ అక్కడ కూతురు మహేశ్వరి కనిపించలేదు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్. ఏం చేయాలో తెలియక తల్లి అక్కడ ఇక్కడ వెతికింది. కానీ కూతురు జాడ మాత్రం కనిపించలేదు. దీంతో కూతురు కనిపించకపోవడంతో తల్లి ఒక్కసారిగా ఖంగారుపడి తల్లడిల్లిపోయింది. అనంతరం తల్లి అనసూయ నా కూతురు మహేశ్వరి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనసూయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. మహేశ్వరి కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.