Vegetable Vendor: కొంతమంది వ్యాపారులు మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్నారు. పానీ పూరి బండి వ్యాపారి మూత్రం పోసి పానీ పూరి అమ్మటం.. పుల్కాలు చేసే వ్యక్తి తన ఉమ్మితో పుల్కాలు చేయటం ఇలా చాలా సంఘటనలు జరిగాయి. అలాంటి వారిపై పోలీసులు చర్యలు కూడా తీసుకున్నారు. కానీ, అలా నేరాలు చేసే వారిలో మాత్రం మార్పు రావటం లేదు. కొందరు దున్నపోతు మీద వాన పడ్డ చందాన వ్యవహరిస్తున్నారు. తమ క్రూర చేష్టలకు ఇంకా పదును పెడుతున్నారు. తాజాగా, ఓ కూరగాయల వ్యాపారి కూరగాయలపై మూత్రం పోసి అమ్మటం మొదలుపెట్టాడు. చివరకు విషయం బయటపడి కటకటాల పాలయ్యాడు.
ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, బరేలీ జిల్లాలోని ప్రేమ్ నగర్‌కు చెందిన షరీఫ్ ఖాన్ కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. గత శుక్రవారం షరీఫ్ కూరగాయల బండితో వ్యాపారం చేసుకుంటూ వెళుతున్నాడు. ఓ చోట రోడ్డు పక్కన బండి ఆపాడు. ఆ తర్వాత బండిలోని కూరగాయలపై మూత్రం పోయటం మొదలుపెట్టాడు. ఇది గమనించిన దుర్గేష్ గుప్త అనే వ్యక్తి దాన్నంతా వీడియో తీశాడు. వెంటనే అతడి దగ్గరకు పోయి ఎందుకిలా చేస్తున్నావని అడిగాడు.
దీంతో షరీప్.. దుర్గేష్‌పై మండిపడ్డాడు. ఇద్దరి మధ్యా గొడవ మొదలై పెద్దదైంది. చుట్టు పక్కల జనం అక్కడ గుమిగూడారు. ఏం జరిగిందని అడిగారు. దుర్గేష్ జరిగిందంతా చెప్పాడు. ఈ నేపథ్యంలో జనం షరీఫ్‌పై విరుచుకుపడ్డారు. తీవ్రంగా కొట్టారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడ్ని స్టేషన్‌కు తీసుకుపోయి విచారించారు. మొదట తాను ఆ పని చేయలేదని షరీఫ్ అన్నాడు. దుర్గేష్ వీడియో చూపించే సరికి నిజం ఒప్పుకున్నాడు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
एक इंसान कितनी हद तक गिर सकता है, इस वीडियो में देखा जा सकता है. सब्जी पर पेशाब करके बेचने जा रहा था मुस्लिम बुजुर्ग. अगर वीडियो न बनता तो यही सब्जियां घरों में पहुंचती.
मामला यूपी के बरेली का है. जनाब अब पुलिस की गिरफ्त में हैं. @bareillypolice
देखें वीडियो – pic.twitter.com/1x4Fs5pYvg
— Sudhanshu Gaur (@SudhanshuGaur24) September 17, 2022