సాధారణంగా ఎవరైన మరణిస్తే ఒకటి లేదా రెండు రోజులు శవానికి అంత్యక్రియలు చేస్తారు. ఇకపోతే అతని కూతుళ్లు, కుమారులు కానీ ఇతర దేశాల్లో ఉంటే వాళ్లు వచ్చేంత వరకు మహా అయితే మూడు రోజులు ఉంచి ఎవరూ రాకపోతే కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుని అంత్యక్రియలు చేస్తారు. కానీ ఓ భార్య మాత్రం భర్త శవాన్ని ఏకంగా ఏడాదిన్నర పాటు ఇంట్లోనే ఉంచుకుంది. చాలా ఆలస్యంగా ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? భర్త శవాన్ని భార్య అంత కాలం ఉంచడానికి బలమైన కారణం ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తర్ ప్రదేశ్ లోని శివపురి ప్రాంతంలో విమలేష్, మిథాలి అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. భర్త ఆహ్మదాబాద్ లో ఆదాయ పన్ను శాఖలో పని చేస్తుండగా, భార్య ఓ బ్యాంక్ మేనేజర్ గా పని చేస్తుంది. చాలా కాలం వరకు వీరి కాపురం సంతోషంగా సాగింది. ఇదిలా ఉంటే విమలేష్ అనారోగ్య సమస్యలతో 2021 ఏఫ్రిల్ 22న మరణించాడు. విమలేష్ శవానికి అంత్యక్రియలు చేయకుండా అతని కుటుంబ సభ్యులు ఏడాది కాలంగా ఇంట్లోనే ఉంచుకున్నారు. స్థానికులు ఎవరైన శవాన్ని ఏంటి ఇన్ని రోజులు ఇంట్లోనే ఉంచారు అని ప్రశ్నించగా.., అతను చనిపోలేదు, కోమాలో ఉన్నాడంటూ విమలేష్ కుటుంబ సభ్యులు అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు.
అయితే ఇటీవల విమలేష్ భార్య మిథాలి అతనికి పెన్షన్ కోసం దారఖాస్తు చేయడానికి వెళ్లి అధికారికి పొరపాటున డెత్ సర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో అసలు విషయం బయటపడింది. అలెర్ట్ అయిన అధికారులు ఇదే విషయాన్ని పై అధికారులకు చేరవేశారు. దీంతో పోలీసుల సాయంతో వారి ఇంట్లోకి వెళ్లి చూడగా విమలేష్ శవం బెడ్ కు అతుక్కొని కనిపించింది. ఈ సీన్ ను చూసిన అధికారులు, పోలీసులు షాక్ గురై నోరెళ్లబెట్టారు. అనంతరం పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు విమలేష్ కుటుంబ సభ్యులపై ఆవేశంతో ఊగిపోయారు. ఇన్ని రోజులు ఆ శవాన్ని ఇంట్లో ఎందుకు ఉంచుకున్నరనే విషయం మాత్రం తెలియరాలేదు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
कानपुर में डेढ़ साल से घर में रखे थे इनकम टैक्स अधिकारी का शव, परिवार मौत स्वीकारने को तैयार ही नहीं। कोरोना काल में हो चुकी थी अधिकारी की मौत pic.twitter.com/8HdoO5SBb2
— AYUSH TIWARI (@AYUSHTI10077811) September 23, 2022