నేటి కాలంలో చాలా మంది యువత ప్రేమిస్తున్నామని వెంటపడతారు. కాదంటే హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ ప్రియుడు ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోవాలని కోరడంతో ప్రియుడు రూటు మార్చి ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2019లో యూపీలోని ఝజియాబాద్ లో గీతిక (35) అనే మహిళ స్థానికంగా ఓ స్కూల్ లో టీచర్ గా పని చేస్తుంది. దీంతో స్థానికంగా ఉండే దీపక్ (25) అనే యువకుడు గీతికను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.
ఇక దీపక్ గీతికపై ప్రేమను ఒలకబోయడంతో గీతిక ఎట్టకేలకు దీపక్ ప్రేమలో పడింది. అలా కొన్నాళ్ల పాటు వీరిద్దరూ ప్రేమ విహారంలో తేలియాడారు. సమయం దొరికినప్పుడల్లా సినిమాలకు, షికారులకు తిరిగేవారు. ఇక గీతిక మాత్రం దీపక్ ను మనస్ఫూర్తిగా ప్రేమించింది. ఎలాగైన ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఇక ఇదే విషయమై ప్రియురాలు ప్రియుడిని అనేక సార్లు కోరింది. దీపక్ సరేనంటూ దాటవేస్తూ వచ్చాడు. కానీ దీపక్ మాత్రం గీతిక నా కన్న 10 ఏళ్లు పెద్దది కావడంతో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు.
అయితే గీతిక మరోసారి ప్రియుడుని పెళ్లి చేసుకోవాలని కోరింది. గీతిక ఇలా ప్రతీసారి అడగడంతో కోపంతో ఊగిపోయాడు. గీతికను ప్రాణాలతో లేకుండా చేస్తే ఓ పీడ వదిలిపోతుందని అనుకున్నాడు. ఇక అనుకున్నదే ఆలస్యం.., ఇటీవల పెళ్లి విషయం ఎత్తడంతో కోపంతో ఊగిపోయాడు. అయితే ఇటీవల గీతిక తన రూమ్ లో ఉండగా ప్రియుడు దీపక్ వచ్చాడు. పక్కా ప్లాన్ తో వచ్చిన దీపక్ ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె శవాన్ని దొరకకుండా నిర్మానుష్య ప్రాంతంలో పడేశాడు. ఇదే విషయం చివరికి పోలీసులకు తెలియడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని విచారించారు. ఇక పోలీసులు గీతిక ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిందితుడు దీపక్ ను అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. 2019 జరిగిన ఈ ఘటనలో నిందితుడికి శిక్ష పడడంతో ఈ ఘటన స్థానికంగా మరోసారి తీవ్ర చర్చనీయాంశమవుతోంది.ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.