ఈ మధ్యకాలంలో కొంతమంది మహిళలు పెళ్లై పిల్లలు ఉన్నా కూడా పక్కింటి పుంటికూర రుచి వేరన్నట్లుగా పరాయివాడి మోజులో పడిపోతున్నారు. ఇంతటితో ఆగుతారా అంటే అదీ లేదు. భర్తకి మస్కా కొట్టి ఎంచక్కా ప్రియుడితో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అలా సమయం దొరికినప్పుడల్లా సినిమాలు, షికారులు అంటూ తెగ తిరుగుతున్నారు. అచ్చం ఇలాగే ఓ పెళ్లైన మహిళ ప్రియుడితో నడి రోడ్డుపై స్కూటీపై వెళ్తూ భర్తకు దర్శనమిచ్చింది. ఈ సీన్ ను చూసిన భర్త, ఛేజ్ చేసి మరీ పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలోని సికిందర్ అనే వ్యక్తికి ఓ మహిళతో పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఓ కూతురు కూడా ఉంది. అయితే సికిందర్ స్నేహితుడు అప్పుడ్పప్పుడు సికిందర్ ఇంటికి వస్తుండేవాడు. అలా వీరి ఇంటికి వస్తున్న తరుణంలోనే సికిందర్ భార్యతో అతను పరిచయం పెంచుకున్నాడు. వీరి పరిచయం రాను రాను వివాహేతర సంబంధంగా రూపుదాల్చింది. భర్తకు తెలియకుండా సికిందర్ భార్య ప్రియుడితో సమయం దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేస్తూ వచ్చింది. అలా కొంత కాలానికి ఆ మహిళ భర్తతో కంటే ప్రియుడితోనే ఉండేందుకే ఇష్టపడింది.
ఇందులో భాగంగానే ఇటీవల సికిందర్ భార్య ఇంట్లో నుంచి కనిపించకుండా పోయింది. సికిందర్ చాలా చోట్ల వెతికాడు. భార్య ఆచూకి మాత్రం దొరకలేదు. కాగా ఇటీవల సికిందర్ తన కూతురితో పాటు బైక్ పై ఆగ్రా వెళ్లాడు. అలా సికిందర్ రోడ్డుపై వెళ్తుండగా తన భార్య మాస్క్ వేసుకుని ప్రియుడితో స్కూటీపై కనిపించింది. వెంటనే అలెర్ట్ అయిన భర్త సికిందర్ బైక్ ఆపాలంటూ వారితో వాధనకు దిగాడు. సికిందర్ మాటను లెక్కచేయని భార్య ప్రియుడితో బైక్ పై మరింత వేగంగా వెళ్లారు. ఇలా కాదని భావించిన సికిందర్.., తన బైక్ తో ఛేజింగ్ చేసి ఎట్టకేలకు భార్యను పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Watch this
Man with his minor daughter chase his wife while she was on outing with her paramour. Man waylaid the duo & rained punches on his wife’s paramour. Police challaned paramour under CrPc 151.
Incident of #Agra, #UttarPradesh pic.twitter.com/3fXgKusAYd
— Arvind Chauhan (@Arv_Ind_Chauhan) September 12, 2022