దేశంలో దుర్మార్గులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఆడది అందంగా కనిపిస్తే చాలు.. ఏదేదో చేయాలనే కసితో రగిలిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా విర్రవీగి ప్రవర్తిస్తూ ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. అయితే ఇలాంటి అత్యాచార ఘటనలపై ప్రభుత్వాలు ఇప్పటికే దిశ, నిర్భయ వంటి కఠినమైన చట్టాలు రూపొదించినా.. కేటుగాళ్ల ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ముగ్గురు యువకులు ఓ 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి రూమ్ లో బంధించారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచనలంగా మారుతోంది.
పోలీసుల కథనం మేరకు.. ఉత్తర్ ప్రదేశ్ లోని అలీఘర్ జిల్లాలోని ఓ ప్రాంతంలోని 13 ఏళ్ల బాలిక నివాసం ఉంటుంది. ఈ బాలికపై కొందరు కేటుగాళ్లు ఎప్పటి నుంచో ఓ కన్నేసి ఉంచారు. ఇటీవల ఆ ముగ్గురు యువకులు పట్టపగలు ఎవరూ లేని టైమ్ లో ఆ బాలికను కిడ్నాప్ చేశారు. అనంతరం ఓ గదిలో బందించి ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంతటితో ఆగక ఆ సమయంలో వీడియోలు తీసి.. ఎవరికైన చెబితే నీ వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని ఆ బాలికను బెదిరించారు.
అలా కొంత కాలం నుంచి ఆ దుర్మార్గుల వేధింపులను భరించలేని ఆ బాలిక ఎట్టకేలకు తనపై జరిగిన దారుణాన్ని తల్లికి వివరించింది. ఒక్కసారిగా షాక్ కు గురైన ఆ బాలిక తల్లి వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులతో పాటు మరో మహిళను కూడా అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచనలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.