ప్రతీ భార్య భర్త సంతోషంగా ఉండాలని ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. అచ్చం ఇలాగే ఆలోచించిన ఓ ఇల్లాలు భర్త ఆయుష్షు పెరగాలని పూజలు చేసింది. కానీ, భర్త మాత్రం భార్యను ప్రాణాలతో లేకుండా కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ దారుణ ఘటనలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తర్ ప్రదేశ్ హర్దోయ్ పట్టణం ఆజాద్ నగర్ లో మోనీగుప్తా, హర్దోజ్ దంపతులు నివాసం ఉంటున్నారు.
వీరికి 22 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఇక పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే ఈ దంపతుల దాంపత్య జీవితం కొన్నాళ్ల పాటు సాఫీగానే సాగుతూ వచ్చింది. కానీ రోజులు మారే కొద్ది భర్త ప్రవర్తన వక్రమార్గంలోకి వెళ్లింది. దీంతో భార్యను రోజు కొడుతూ తీవ్ర వేధింపులకు పాల్పడేవాడు. భార్య మోనీగుప్తా మాత్రం భర్త పెట్టే టార్చర్ ను భరిస్తూ వచ్చేది. అయితే ఈ క్రమంలోనే ఇటీవల భార్యాభర్తల మధ్య ఓ గొడవ జరిగింది. దీంతో భర్త భార్యను దారుణంగా చితకబాదాడు. భర్త ఎంత టార్చర్ పెట్టినా, ఎన్ని సార్లు దాడి చేసినా.. భార్యకు భర్త మీద ప్రేమ మాత్రం తగ్గలేదు.
దీంతో ఇటీవల కర్వాచౌత్ సందర్భంగా భార్య మోనీగుప్తా భర్త ఆయుష్షు పెరగాలని ఉపవాసంతో ఆ దేవుడికి పూజలు చేసింది. కానీ ఇవేవి పట్టించుకుని భర్త దారుణానికి పాల్పడ్డాడు. భార్య పూజలు చేస్తుండగా భర్త హర్దోజ్ వెనకాల నుంచి కత్తితో పొడిచి భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ దాడిలో భార్య రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ విషయం చివరికి పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.