వాళ్లిద్దరూ భార్యాభర్తలు. పెళ్లై కూడా చాన్నాళ్లే అయింది. సుఖమైన శృంగారాన్ని అనుభవించాల్సిందిపోయి భర్త కట్టుకున్న భార్యకు బెడ్రూంలో నరకం చూపించాడు. ఇక కాపురం పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అసహజ శృంగారం చేయాలంటూ భర్త భార్యను టార్చర్ పెట్టేవాడు. భర్త టార్చర్ ను భరించలేని ఆ మహిళ ఊహించని నిర్ణయం తీసుకుంది. భార్య తీసుకున్న నిర్ణయంతో భర్తకు ఊహించని షాక్ తగిలింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
అసలేం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ లోరని హాపూర్‌లోని గర్ ముక్తేశ్వర్ కొత్వాలి ప్రాంతం. ఇక్కడే ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. పెళ్లైన నాటి నుంచి భర్త కాస్త దుర్బుద్దితో ప్రవర్తిస్తూ భార్యను టార్చర్ పెట్టేవాడు. ప్రతీ రోజూ బెడ్రూంలో అశ్లీల వీడియోలు చూపిస్తూ భర్త కామ కోరికలు తీర్చుకునేవాడు. ఇలా కొన్నాళ్ల పాటు భార్య భరిస్తూ వచ్చింది. రాను రాను భర్త టార్చర్ మరింత ఎక్కువైంది. ఇక ఇంతటితో ఆగకుండా.. భర్యను బలంతం చేస్తూ కాదంటే కొడుతూ భర్త అత్యాచారం చేసేవాడు.
భర్త ఇలా రోజు బెడ్రూంలో భార్యను టార్చర్ పెట్టడంతో భార్య తట్టుకోలేకపోయింది. కట్టుకున్న వాడే ఇలా కామంతో రంకెలేయడంతో భార్యకు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఇక చేసేదేం లేక భార్య మహిళా పోలీసులను ఆశ్రయించింది. భార్య ఫిర్యాదుపై స్పందించిన మహిళా పోలీసులు భర్తను అరెస్ట్ చేసి బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనలో భర్త భార్యను టార్చర్ పెడుతూ బలవంతంగా అనేక సార్లు అత్యాచారం చేశాడని పోలీసులు తేల్చారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.