సమాజంలో చదువు చెప్పే మాస్టారుకు, వైద్యం చేసే డాక్టర్ కు ఎంతో గౌరవం ఉంది. ఇలాంటి పవిత్రమైన వృత్తిని కొందరు అపవిత్రపాలు చేస్తున్నారు. సభ్యసమాజం తలదించుకునేలా చేస్తూ అడ్డగొలుగా బరితెగించి ప్రవర్తిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఇలాంటి దారుణానికే పాల్పడ్డాడు డాక్టర్ వృత్తిలో ఉన్న ఓ దుర్మార్గుడు. అసలు విషయం ఏంటంటే..అది ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఇందిరానగర్. ఇదే ప్రాంతానికి చెందిన ఓ 50 ఏళ్ల డాక్టర్ ఇక్కడే నివాసం ఉంటున్నాడు.
ఇతనికి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. అయితే పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి ఓ టీచర్ ను అతడి ఇంటికి పిలిపించుకున్నాడు. అలా ఆ లేడీ టీచర్ వస్తూ పోతూ ఉండడంతో ఆమెపై ఆ డాక్టర్ కన్నేశాడు. ఇక ఆమెకు తెలియకుండా ఫోటోలు తీస్తూ ఆ ఫోటోలను మార్ఫింగ్ చేశాడు. అనంతరం ఆ ఫోటోలను ఆ యువతికి చూపిస్తూ బ్లాక్ మెయిల్ కు దిగేవాడు. దీంతో ఇదే అదునుగా భావించిన ఈ దుర్మార్గుడు ఆ ట్యూషన్ టీచర్ పై లైంగిక దాడికి పాల్పడేవాడు. ఇక కొన్నాళ్లకి ఆ యువతి గర్భవతి అని తేలింది.
ఇది కూడా చదవండి: Vanasthalipuram: వనస్థలిపురం బ్యాంక్ చోరీలో కొత్త కోణం.. నిందితుడు క్యాషియర్ సంచలన ఆరోపణలు!
వెంటనే ఆ గర్భం పోయేందుకు డాక్టర్ ఆమెకు మందులు ఇచ్చాడు. ఆ మందుల ప్రభావంతో ఆ యువతి ఆరోగ్యం బాగా క్షీణించింది. ఏం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరా తీయగా తనపై జరిగిన దారుణాన్ని కూతురు వివరించే ప్రయత్నం చేసింది. ఇక ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.