ఈ దంపతులకు పెళ్లైన చాలా ఏళ్ల తర్వాత ఓ కూతురు జన్మించింది. ఒక్కగానొక్క కూతురు కావడంతో తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. మేము మంచాన పడితే కూతురే చూసుకుంటుందని ఎంతో ఆశపడ్డారు. కానీ, అదే కూతురు.. ప్రియుడి కోసం ఏకంగా కనిపెంచిన తల్లిదండ్రులను దారుణంగా హత్య చేసి కాటికి పంపింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
పైన ఫొటోలో కనిపిస్తున్న దంపతుల పేర్లు షబ్బీర్, రెహానా. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన చాలా ఏళ్ల తర్వాత వీరికి ఒక అమ్మాయి జన్మించింది. ఇక కూతురుని ఆ తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. బాగా చదువుని ప్రయోజకురాలై.. మేము మంచాన పడితే చూసుకుంటుంది అనుకున్నారు. కానీ, ఆ కూతురు మాత్రం.. తెలిసి తెలియని వయసులోనే స్థానికంగా ఉండే ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు.. ఇదేం పనంటూ మందలించారు. ఇదే కోపంతో కూతురు ఎలాగైన తల్లిదండ్రులను ప్రాణాలతో లేకుండా చేయాలని అనుకుని.. చివరికి తాను అనుకున్నదే చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. అది ఉత్తర్ ప్రదేశ్ బులందర్ షహర్ పరిధిలోని షికార్ పూర్ గ్రామం. ఇక్కడే షబ్బీర్ (45), రెహానా (42) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల తర్వాత ఓ కూతురు (17) జన్మించింది. ఒక్కగానొక్క కూతురు కావడంతో తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అయితే కూతురు మాత్రం తెలిసి తెలియని వయసులో ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఇక రాను రాను ఆ బాలికకు తల్లిదండ్రుల కంటే ప్రియుడిపైనే ఇష్టం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే కూతురి ప్రేమ గురించి ఇటీవల తల్లిదండ్రులకు తెలిసింది. చదువుకోకుండా ఇవేం పిచ్చి పనులు అంటూ.. కూతురిని మందలించారు. అంతేకాకుండా ఆమె ప్రియుడికి కూడా వార్నింగ్ ఇచ్చారు.
దీంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులపై కోపంతో ఊగిపోయింది. ఎలాగైన తల్లిదండ్రులను ప్రాణాలతో లేకుండా చేసి ప్రియుడికి దగ్గరవ్వాలని పథకం రచించింది. అనుకున్నదే ఆలస్యం.. ఆ బాలిక ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇక మార్చి 14న తల్లిదండ్రులు తినే ఆహారంలో కూతురు నిద్రమాత్రలు కలిపింది. ఆ విషయం తెలియని షబ్బీర్, రెహానా దంపతులు నిద్రమాత్రలు కలిపిన ఆహారం తిని పడుకున్నారు. ఇదే మంచి సమయం అనుకున్న కూతురు ప్రియుడిని ఇంటికి పిలిపించింది. ఇక అదే రోజు రాత్రి ప్రియుడితో కలిసి కూతురు తల్లిదండ్రులను గొడ్డలితో నరికింది. ఈ ప్రమాదంలో తల్లి రెహానా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన షబ్బీర్ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
కానీ, చికిత్స పొందుతూ చివరికి షబ్బీర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటనపై అనుమానాస్పదమృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో భాగంగా ముందుగా ఆ దంపతుల కూతురిని విచారించారు. ఆ బాలిక పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో పోలీసులకు ఆ బాలికపై కాస్త అనుమానం బలపడింది. పోలీసుల స్టైల్ లో విచారించే సరికి ఆ బాలిక అసలు నిజాలను బయటపెట్టింది. తన ప్రియుడితో తల్లిదండ్రులు మాట్లాడొద్దన్నారని, అందుకే హత్య చేసినట్లు ఆ బాలిక అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసులు ఆ బాలికతో పాటు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మరింది. ప్రియుడి కోసం కన్న తల్లిదండ్రులను హత్య చేసిన మైనర్ బాలిక దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.