ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంతకాలానికి ఈ మహిళ ఓ కుమారుడు, కూతురు జన్మించారు. పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఈ ఇల్లాలు కొన్నాళ్లు కాలం గడిపింది. అలా వీరి సంసారం సాగుతున్న తరుణంలోనే ఈ కిలాడీ లేడి స్థానికంగా ఉండే ఓ కార్పోరేటర్ తో ప్రేమాయణం కొనసాగించింది. ఇక ప్రియుడితో గడిపేందుకు పిల్లలు అడ్డుగా ఉన్నారని ఆ మహిళ ఏం చేసిందో తెలుసా?
ఆమెకు పెళ్లై రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలం పాటు భర్తతో బాగానే సంసారం చేస్తూ వచ్చింది. అలా కొన్నేళ్లు గడిచింది. ఈ క్రమంలోనే ఆ మహిళ కట్టుకున్న భర్తను కాదని స్థానికంగా ఉండే మరో మగాడితో ప్రేమాయణం నడిపించింది. ఆ మహిళ భర్త కళ్లు గప్పి ప్రియుడితో ఎంచక్కా రొమాన్స్ కు తెరలేపేది. ఇక తన ప్రియుడితో గడిపేందుకు పిల్లలు అడ్డుగా ఉన్నారని ఆ కిలాడీ లేడి ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. అది ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ ప్రాంతం. ఇక్కడే ఓ మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు పెళ్లై 10 ఏళ్ల కొడుకు, 6 ఏళ్ల కూతురు ఉన్నారు. కొంత కాలం పాటు ఆ మహిళ పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఉండేది. దీంతో అలా కొన్ని రోజులు ఆ మహిళ భర్తతో సంసారాన్ని నెట్టుకుంటూ వచ్చింది. కానీ, రాను రాను ఈ కిలాడీ తన వక్రబుద్దిని చూపించింది. విషయం ఏంటంటే? ఈ మహిళ స్థానికంగా ఉండే ఓ కార్పోరేటర్ పై మనసుపడింది. ఇక అప్పటి నుంచి భర్తకు తెలియకుండా ఆ మహిళ ప్రియుడితో తిరిగేది.
అలా భర్త కళ్లు గప్పి ఆ మహిళ ప్రియుడితో చీకటి కాపురాన్ని నడిపిస్తూ వచ్చింది. అయితే ప్రియుడితో గడిపేందుకు పిల్లలు అడ్డుగా ఉన్నారని ఆ మహిళ భావించింది. ఈ సమయంలో ఈ దుర్మార్గురాలికి ఓ ఐడియా తట్టింది. అదే తన కన్న పిల్లలను ప్రాణాలతో లేకుండా చేయడం. ఇక అనుకున్నదే ఆలస్యం.. ఈ కసాయి తల్లి ప్రియుడితో చేతులు కలిపి మార్చి 22న తన కొడుకు, కూతురిని అతి దారుణంగా హత్య చేసింది. అనంతరం వారి మృతదేహాలను ఎవరికీ కనిపించకుండా ఓ కాలువలో పడేసింది.
అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పిల్లలు కనిపించడం లేదని పోలీసులకు సమాచారం అందించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లిని విచారించగా.. చేసిన దారుణంపై అసలు నిజాలు బయటపెట్టింది. అనంతరం ఈ దారుణ ఘటనపై సుపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పియూష్ సింగ్ నిజ నిజాలు మీడియాకు వివరించారు. నిందితులను అరెస్ట్ చేశామని, ఇంకా పిల్లల మృతదేహాలు దొరకలేదని తెలిపారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
Meerut, UP | On 22nd March, 2 siblings, a 10-year-old boy & 6-year-old girl were murdered & bodies were thrown into canal by their mother and her lover, namely Saud who is local councillor along with help of their neighbours. When children went missing, a case was registered &… pic.twitter.com/nxlP3cAjRL
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 25, 2023