వివాహేతర సంబంధాలు.. ఇవే పచ్చని సంసారంలో నిప్పులు పోస్తున్నాయి. పెళ్లై పిల్లలున్నా కూడా కొందరు మహిళలు అక్రమ సంబంధాల మోజులో పడి క్షణిక సుఖం కట్టుకున్న భర్తకు పంగనామాలు పెడుతున్నారు. ఇలాగే బరితెగించిన ఓ 42 ఏళ్ల మహిళ భర్త ఫ్రెండ్ తో వివాహేతర సంబంధాన్ని నడిపి, రెడ్ హ్యాడెడ్ గా భర్తకు దొరికింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ స్టోరీ చదవాల్సిందే.
ఉత్తర్ ప్రదేశ్ లోని ఝజియాబాద్ లో సునీల్( 45), దీపా (42) అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. ఇద్దరు సంతానం. తమ కూతురుకి సైతం రెండేళ్ల కిందటే వివాహం జరిపించారు. అప్పటి నుంచి భార్యాభర్తలు ఎలాంటి ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉంటున్నారు. అయితే భర్త సునీల్ ఫ్రెండ్ రవి అనే వ్యక్తి అప్పుడప్పుడు వీరి ఇంటికి వస్తుండేవాడు. అలా వస్తుండడంతో దీపాకు రవితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం చివరికి వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే గత 10 పదేళ్లుగా వీరి వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇన్నేళ్ల నుంచి భర్తకు తన చీకటి సంసారం గురించి తెలియకుండా జాగ్రత్త పడింది.
ఇక సమయం దొరికినప్పుడల్లా భార్య ప్రియుడితో తెగ ఎంజాయ్ చేసేది. అయితే ఇటీవల భర్త సునీల్ ఇంట్లో లేకపోవడంతో ప్రియుడు రవిని ఇంటికి రమ్మని కబురు పంపింది. దీంతో ఎగేసుకుంటూ వచ్చిన ప్రియుడితో దీపా తెగ రొమాన్స్ చేసింది. ఇక వీరిద్దరూ బెడ్ రూంలో ఉండగా దీపా భర్త సడెన్ గా ఎంట్రీ ఇచ్చాడు. భార్య పరాయి మగాడితో నగ్నంగా కనిపించడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. కోపంతో ఊగిపోయిన సునీల్.. తన భార్యను, ఆమె ప్రియుడిని కర్రతో దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలోనే సునీల్ చేతిలో ఉన్న కర్రను దీపా ప్రియుడు రవి లాక్కుకున్నాడు. అనంతరం ఇద్దరు కలిసి సునీల్ పై దాడి చేశారు.
ఈ దాడిలో సునీల్ అక్కడికక్కడే మరణించాడు. ఆ తర్వాత భర్త శవాన్ని సంచిలో కట్టి ఇంట్లోనే రెండు రోజుల పాటు ఉంచారు. ఇక దుర్వాసన రావడంతో ఆ శవాన్ని తీసుకెళ్లి మోడీనగర్ సమీపంలోని ఓ పొలంలో విసిరేశారు. ఇక స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టగా ఎట్టకేలకు భార్యే భర్తను హత్య చేసిందని తేలింది. ఇక పోలీసులు దీపాతో పాటు ఆమె ప్రియుడు రవిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్రకలకలంగా మారుతోంది. క్షణిక సుఖం కట్టుకున్న భర్తను మట్టుబెట్టిన భార్య దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.