పేద కుటుంబంలో పుట్టిన ఆ యువతికి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనే కోరిక ఉండేది. దీని కోసం అహర్నిశలు కృషి చేస్తూ కష్టపడి ఉన్నత చదువులు చదివింది. చివరికి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించి తన డాక్టర్ కలను ఎట్టకేలకు నిజం చేసుకుంది. ఇలా ఎన్నో ఏళ్ల తన కలను సాధించానని గర్వంగా సంతోషపడింది. ఇక తన గమ్యానికి చేరుకుని డాక్టర్ గా సేవలు అందిస్తున్న క్రమంలోనే ఉన్నట్టుండి ఓ దుర్మార్గుడి చేతిలో ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారుతోంది. ఈ క్రైమ్ కథా చిత్రంలో అసలేం జరిగింది? ఆ జూనియర్ డాక్టర్ ను హత్య చేసింది ఎవరు? అంతలా దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలోని ఎస్ ఎన్ మెడికల్ కాలేజీలో యోగిత అనే యువతి గైనకాలజిస్ట్ విభాగంలో డాక్టర్ గా సేవలు అందిస్తుంది. డాక్టర్ అవ్వాలని ఎంతో కష్టపడి చదివిన యోగిత చివరికి తాను ఎంచుకున్న మార్గంలో విజయం సాధించింది. అనంతరం ఎంతో మంది పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తూ గొప్ప డాక్టర్ గా పేరు తెచ్చుకుంది. అయితే ఇదే ఆస్పత్రిలో ఏంబీబీఎస్ పూర్తి చేసిన వివేక్ తివారి అనే వ్యక్తి ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అలా తను విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే వివేక్ తివారికి జూనియర్ డాక్టర్ అయిన యోగిత పరిచయం అయింది. ఇలా కొన్నాళ్ల తర్వాత వీళ్లిద్దరూ కాస్త సన్నిహితంగా మెలిగినట్లుగా తెలుస్తోంది.
దీంతో అలా వీరిద్దరూ దాదాపు 7 ఏళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నట్లు సమాచారం. యోగిత అందం చూసి ఆశపడ్డ వివేక్ తివారి ఎలాగైన యోగితను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఇదే విషయాన్ని యోగితకు కూడా చెప్పాడు. కానీ యోగిత మాత్రం అతనితో పెళ్లికి నిరాకరించింది. ఇక చేసేదేం లేక వివేక్ తివారి యోగిత తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. మీ కూతురిని నేను పెళ్లి చేసుకుంటాను. మీరు ఒప్పించకుంటే చంపేస్తానంటూ అనేక సార్లు బెదిరింపులకు దిగాడు. ఇటీవల వివేక్ తివారి ఆగ్రాలో ఉంటున్న యోగిత ఇంటికి వెళ్లాడు. అక్కడికి వెళ్లి యోగితను తన కారులో ఎక్కించుకున్నాడు.
అనంతరం ఆగ్రాలో వీధుల్లో తిరుగుతూ.. నన్ను పెళ్లి చేసుకోవాలంటూ యోగితను వివేక్ తివారి మరోసారి కోరాడు. యోగిత మాత్రం పెళ్లి చేసుకునేదే లేదంటూ వివేక్ కు తెగేసి చెప్పింది. ఇక కోపంతో ఊగిపోయిన వివేక్ అదే కారులో యోగితను దారుణంగా హత్య చేశాడు. అనంతరం వివేక్ తివారి ఓ వీడియోను విడుదల చేస్తూ.. నేను యోగిత గత 7 ఏళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నామని, తనను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ యోగిత మాత్రం తనతో పెళ్లికి నిరాకరించింది. తాను నాతో పెళ్లికి నిరాకరించడంతో తట్టుకోలేక యోగితను చంపేశానంటూ తెలిపాడు. ఇదే వీడియో కాస్త వైరల్ గా మారి చివరికి పోలీసుల వరకు వెళ్లింది.
ఈ క్రమంలోనే యోగిత తల్లిదండ్రులు కూతురుకి ఫోన్ చేశారు. అస్సలు స్పందించలేదు. యోగిత జాడను కనిపెట్టేందుకు ఆమె తల్లిదండ్రులు అంతట వెతికారు. కానీ ఎక్కడ కూడా యోగిత ఆచూకి దొరకలేదు. ఈ క్రమంలోనే కూతురు యోగిత చనిపోయిందనే చావు వార్త అందింది. ఇక కూతురి మరణవార్త తెలియగానే తల్లిదండ్రులు కన్నీటి సంద్రంలో మునిగితేలారు. అనంతరం ఆ యువతి తల్లిదండ్రులు ఇది ఖచ్చితంగా వివేక్ తివారి పనేనంటూ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు వివేక్ తివారిని అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.