అది తమిళనాడులోని కురవన్ పాళయం పరిధిలోని కడలూరు. ఈ మారుమూల ప్రాంతంలోనే వనిత (33) అనే మహిళ నివాసం ఉంటుంది. గతంలో ఈమెకు పెళ్లై 16 ఏళ్ల కూతురు ఉంది. ఆ బాలిక ఇప్పుడు ఇంటర్ చదువుతుంది. అయితే ఇదే బాలికపై గత కొంత కాలం నుంచి స్థానికంగా ఆటో నడుపుకునే శివమణి అనే వ్యక్తి కన్నేశాడు. ఆ బాలికకు ఎన్నో మాయ మాటలు చెప్పిన శివమణి.., ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఇక ఇంతటితో ఆగకుండా ఆ దుర్మార్గుడు ఆ బాలికను నమ్మించి అనేక సార్లు అత్యాచారం కూడా చేశాడు.
అలా కొన్నాళ్లకి ఆ బాలిక గర్భవతి అని తేలింది. ఇదే విషయం ఆ బాలిక తల్లి అయిన వనితకు తెలిసింది. కూతురిపై ఇంతటి దారుణానికి కాలుదువ్వింది ఆటో డ్రైవర్ శివమణి అని చివరికి తెలుసుకుంది. ఇక ఎలాగైన ఇతడిని హత్య చేయాలని వనిత ప్లాన్ గీసింది. దీని కోసం ఆమె సోదరుడితో పాటు మరో స్నేహితుడి సాయం కోరింది. వనితకు సాయం చేయడానికి ఆ ఇద్దరు సరేనంటూ ముందుకొచ్చారు. ఇక అనుకున్నదే ఆలస్యం.., పక్కా ప్లాన్ తో వనితో పాటు మరో ఇద్దరు కలిసి ఇటీవల శివమణిని దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు.
ఇక సాయంత్రం అయినా శివమణి ఇంటికి రావకపోవడంతో అతని కుటుంబ సభ్యులు అటు ఇటు అంతా వెతికారు. కానీ ఎక్కడ కూడా శివమణి ఆచూకి లభించలేదు. చేసేదేంలేక అతని కుటుంబ సభ్యులు శివమణి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా స్థానికంగా ఆటోలో శివమణి శవమై కనిపించాడు. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఎట్టకేలకు శివమణిని హత్య చేసింది వనిత అని తెలుసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు వనితతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. తర్వాత హత్య చేసింది మేమేని ముగ్గురు ఒప్పుకోవడంతో వారిని అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.