Crime News: కొంతమంది పోలీసులు తమ ప్రాణాలకు తెగించి కర్తవ్య నిర్వహణ చేస్తుంటే.. మరికొంత మంది పోలీస్ వృత్తికే మాయని మచ్చగా నిలుస్తున్నారు. కనికరం చూపాల్సిన గ్యాంగ్ రేప్ బాధితురాలిపై ఓ పోలీసు అధికారి కన్నేశాడు. ఏకంగా బాలికను పోలీస్ స్టేషన్‌లోనే రేప్ చేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్‌లోని పాలికి చెందిన నలుగు బాలురు అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికను నమ్మించి ఏప్రిల్ 22న భోపాల్‌కు తీసుకెళ్లారు. అక్కడ మూడు రోజుల పాటు ఉంచి అత్యాచారం చేశారు. ఆ తర్వాత బాలికను పాలిలోని లలిత్‌పుర్‌కు తీసుకువచ్చారు. అనంతరం పాలి పోలీస్ స్టేషన్‌లో అప్పగించి, పరారయ్యారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ తిలక్‌ధారి సరోజ్ బాలికను ఆమె బంధువు వెంట చైల్డ్ లైన్ సెంటర్‌కు పంపాడు.
రెండు రోజుల తర్వాత స్టేట్‌మెంట్ తీసుకోవాలని చెప్పి, బాలికను స్టేషన్‌కు రప్పించాడు. గదిలో బాలికపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత మళ్లీ చైల్డ్ లైన్ సెంటర్‌కు పంపాడు. అక్కడ కౌన్సిలింగ్ సందర్భంగా బాలిక తనపై జరిగిన అకృత్యాలను వివరించింది. దీంతో చైల్డ్ లైన్ టీం ఎస్పీని కలిసింది. సరోజ్‌పై ఫిర్యాదు చేసింది. మొత్తం ఆరుగురిపై కేసు నమోదైంది. ఈ ఘటనపై సీరియస్ అయిన ఎస్పీ సరోజ్‌ను సస్పెండ్ చేశారు. మరో ముగ్గరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : డబ్బు మోజులో పడి నన్ను దారుణంగా హింసించారు: యువకుడు ఆత్మహత్య