ఇటీవల హైదరాబాద్ లోని ఓఆర్‌ఆర్‌పై శంషాబాద్ వద్ద శనివారం రాత్రి దగ్ధమైంది. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన డాక్టర్ నేలపాటి సుధీర్(45) అనే వ్యక్తి సజీవదహనమైన విషయం తెలిసిందే. అయితే ఈ కారు దగ్ధమైన ఘటనలో పోలీసుల ప్రాథమిక విచారణలో కొన్ని నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఇక ప్రధానంగా మొదట్లో ఈ హత్యపై పోలీసులకు ఎన్నో అనుమానాలు తలెత్తాయి. ఎవరైన హత్య చేసి పెట్రోల్ పోసి దగ్ధం చేశారా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమయ్యాయి. కానీ ఇలాంటి అనుమానాలు కాకుండా ఎలుకలే ఈ ప్రమాదానికి అసలు కారణమని పోలీసులు భావిస్తున్నారు. అవును.. మీరు విన్నది నిజమే. అసలు విషయం ఏంటంటే? ఈ కారులో ముందుగా ఎలుకలు వైర్లు కొరికాయని దీని కారణంగా స్టీరింగ్ వద్ద వైర్లు తెగిపోవటంతో కారు మొత్తం షార్ట్ సర్యూట్ జరిగింది.
దీంతో ఒక్కసారిగా డీజిల్ ట్యాంక్ పేలటంతో మంటలు అంటుకుని కారు దగ్ధమైంది. ఇక కారు అంటుకున్న సమయంలో ఆ వ్యక్తి బయటకు రావటానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కారు డోర్లు ఎంతకు తెరుచుకోలేదని, ఇక కారుతో పాటే ఆ వ్యక్తి సజీవదహనం కావాల్సి వచ్చిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే హోండా అమేజ్ కారులో స్టీరింగ్ వద్ద వైర్లు తెగినా, ఇతర సమస్యలు వచ్చినా కారు డోర్లు బిగిసుకుపోతాయని నిపుణులు సైతం చెబుతున్నారు. ఇక అగ్నిమాపకశాఖ నివేదిక వస్తే గనుక ప్రమాదానికి గల కారణాలు మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చిన డీసీపీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు ఇక ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.