ఈ మద్య నగరంలో గన్ కల్చర్ పెరిగిపోతుంది.. రియలెస్టేట్ కి సంబంధించిన వివాదాల్లో కొంత మంది గన్ తో బెదిరించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. భూ వివాదాల్లో కొంత మంది గన్ తో బెదిరింపులకు పాల్పపడుతున్నారన్న ఆరోపనలు వినిపిస్తున్నాయి. వికారాబాద్ జిల్లా పూడూరులో గన్ తో బెదిరించిన ఘటన కలకలం రేపింది. తెలుగు సినీ నటుడిని కొంత మంది గన్ తో బెదిరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల హిమాంపల్లి గ్రామంలో రణదీర్ రెడ్డి కొంత భూమిని కొనుగోలు చేశాడు. ఆయన పేరు మీద ధరణి పట్టాదారు పాస్ పుస్తకం కూడా వచ్చింది. ఈ క్రమంలో భూమిని చదును చేయించేందుకు రణదీర్ రెడ్డి కొంత మందితో కలిసి వెళ్లాడు. అయితే భూమిని చదును చేసే క్రమంలో హైదరాబాద్ కి చెందిన హైమత్ ఖాన్ వచ్చి రచ్చ చేశాడు. అంతేకాదు రణదీర్ రెడ్డికి గన్ చూపించి బెదిరించాడు. అతని సన్నిహితులను కత్తులతో బెదిరించి భయబ్రాంతులకు గురి చేశాడు.
వికారాబాద్ కు చెందిన సుభాష్ రెడ్డి దగ్గర తాను భూమి కొనుగోలు చేశానని.. భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయనని రణధీర్‌రెడ్డి చెబుతున్నారు. అయితే సుల్తాన్ హైమద్ వద్ద గన్ ఉన్నది వాస్తవమేనని.. ఆ గన్ కి లైసెన్స్ ఉందని పోలీసులు తెలిపారు.
ఇది చదవండి: సీనియర్ నటుడు శివాజీ గణేశన్ ఇంట్లో వివాదం.. కోర్టు మెట్ల…