నేటి కాలంలో ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా వివాహేతర సంబంధాలకు సంబంధించిన వార్తలే. ఈ అక్రమ సంబంధాల వల్ల జరిగే దారుణాలను చూసి కూడా చాలామంది వాటి వైపే ఆకర్షితులవుతున్నారు. వక్రమార్గంలో వారి పచ్చటి సంసారాలను రోడ్డున పడేయడమే కాకుండా నిండు జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. ఇలా పక్కింటి కుర్రాడితో పడక సుఖం కోసం తాళి కట్టిన భర్తనే దారుణంగా హత్య చేసి చివరికి జైలు పాలైంది ఓ కామపిశాచి. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాది గ్రామానికి చెందిన కలిశెట్టి వెంకటరమణకు, రామభద్రపురం మండలం కొండపాలవలసకు చెందిన 27 ఏళ్ల లలిత కుమారితో 2015లో వివాహమైంది. వీరికి ఐదేళ్ల బాబు, ఏడాదిన్నర పాప ఉన్నారు. భర్త, పిల్లలతో హాయిగా గడుపుతున్న లలిత కుమారి బుద్ధి పెడదోవ పట్టింది. ఆమెకు అదే గ్రామానికి చెందిన 23 ఏళ్ల నరసింగరావు అలియాస్ బాలు అనే కుర్రాడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నాళ్లుగా వారి మధ్య నడుస్తున్న అక్రమ సంబంధం గురించి లలిత కుమారి భర్తకు తెలిసింది. దీంతో భార్యాభర్తల మధ్య గతకొన్ని రోజులుగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. కొన్ని నెలల కిందట భార్యను ఆమె పుట్టింటికి పంపించాడు. ఆమెలో మార్పు వచ్చి ఉంటుందేమోనని భావించి.. మళ్లీ భార్యను ఇంటికి తీసుకువచ్చాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. నిత్యం గొడవలు పడుతూనే ఉన్నారు.
తాజాగా అదే ఊరిలో ఉండే వెంకట రమణ.. అన్న అప్పలనాయుడు ఇంటికి అర్ధరాత్రి సమయంలో ఏడ్చుకుంటూ వెళ్లింది లలిత. తన భర్తకు గుండెనొప్పి వచ్చిందని.. రెండు మాత్రలు వేసుకొని పడుకున్నాడని… ఎంత లేపినా లేవడం లేదని ఏడుస్తూ చెప్పింది. దీంతో హడావుడిగా వెళ్లి చూడగా సోదరుడు మృతిచెంది ఉన్నాడు. వెంకట రమణ శరీరంపై గాయాలు ఉన్నట్టు అప్పలనాయుడు గుర్తించాడు. వెంటనే తన బంధువులకు సమాచారం ఇచ్చాడు. భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్న కారణంగా తన మరదలే చంపేసి ఉంటుందని అనుమానించాడు. వెంటనే సోదరుడి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానంతో ప్రియుడు బాలుతో కలిపి ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. అందులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.
ఇదీ చదవండి: అనుమానంతో ఫోన్ చెక్ చేసిన తల్లిదండ్రులు! కోరిక తీర్చాలంటూ..!
ఓ రోజు రాత్రి భర్త నిద్రపోయిన తర్వాత ప్రియుడికి వీడియో కాల్ చేసి మాట్లాడింది. ప్రియుడు కలవాలంటూ మొండిపట్టు పట్టడంతో ఇంటికి పిలిచింది. ఆ తర్వాత వారి పనిలో వాళ్లు ఉండగా.. భర్తకు మెలకువ వచ్చింది. చూస్తే పక్కన ఉండాల్సిన భార్య లేదు. వంటగదిలో చప్పుడు విని అక్కడికి వెళ్లి చూశాడు. ప్రియుడితో భార్యను చూసిన వెంకటరమణకు చిర్రెత్తుకొచ్చింది. కోపంతో ఇద్దరిపై చేయి చేసుకున్నాడు. కోపంతో ఊగిపోతూ ఆ ఇద్దరూ వెంకటరమణపై దాడి చేశారు. గట్టిగా గోడకు గుద్దడంతో వెంకటరమణ ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత ఆమె గుండెనొప్పి డ్రామా ఆడింది. దీంతో పోలీసులు ఆ ఇద్దరిని అరెస్టు చేశారు. పరాయి మగాడి మోజులో కట్టుకున్న భర్తను కడతేర్చింది. ఆ తర్వాత నిజం బయటపడి జైలు పాలైంది. ఇప్పుడు ఆమె చేసిన తప్పుకు పిల్లలు అనాథలు అయ్యారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.