మొబైల్ ఫోన్ వాడకటం పెరిగిపోయిన తర్వాత అసాంఘీక కార్యాకలాపాలు ఎక్కువయిపోయాయి. ముఖ్యంగా యువత తప్పుదోవపడుతోంది. అన్‌లిమిటెడ్ ఇంటర్‌నెట్ వాడకం పిల్లల్ని చెడగొడుతోంది. కొందరు పిల్లలు పాడు వీడియోలు చూడటానికి అలవాటు పడుతున్నారు. ఆ అలవాటు కాస్తా వ్యసనంగా మారుతోంది. పాడు వీడియోల వ్యవసనంతో కొందరు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఓ బాలుడు పాడు వీడియోలు చూసి రెచ్చిపోయాడు. తనకంటే వయసులో చిన్నదైన ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ఓ 10 ఏళ్ల బాలుడు అక్కడి ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. అతడు మొబైల్ ఫోన్‌కు బానిసగా మారాడు. కొద్దిరోజుల క్రితం తన బంధువైన ఓ వ్యక్తి ఫోన్ తీసుకున్నాడు. అందులో కొన్ని పాడు వీడియోలు చూశాడు. అవి చూసిన తర్వాత అతడిలో క్రూర వాంఛ మొదలైంది. ఇంటినుంచి బయటకు వచ్చాడు. వీధుల్లో నడుస్తూ ఉన్నాడు. ఇంతలో 3వ తరగతి చదువుతున్న ఓ బాలిక తన ఇంట్లో ఒంటరిగా అతడికి కనిపించింది. వెంటనే ఆ ఇంట్లోకి వెళ్లాడు. బాలికతో కొద్దిగా చనువుగా మాట్లాడాడు.
తర్వాత బాలికపై బలవంతంగా అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. కొద్దిసేపటి తర్వాత బాలిక తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో బాలిక ఇంట్లో ఏడుస్తూ కనిపించింది. వాళ్లు ఏమైందని అడిగారు. బాలికపై తనపై జరిగిన అఘాయిత్యం గురించి చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాలుడిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలుడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. పాడు వీడియోలు చూసి బాలికపై దారుణానికి ఒడిగట్టినట్లు అతడు తెలిపాడు.