బాధ్యత గల ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ కొందరు మాస్టారులో విద్యా బుద్దులు నేర్పాల్సింది పోయి బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఇంతటితో ఆగకుండా ఏకంగా అందమైన అమ్మాయిలపై కన్నేస్తూ వారిని మెల్లగా తమ ముగ్గులోకి దింపి తల్లిదండ్రులకు షాక్ ఇస్తూ విద్యార్థిలను ఎగరేసుకుపోతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే తిరుపతిలో చోటు చేసుకుంది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి గాంధీ రోడ్డులోని చైతన్య జూనియర్ కళాశాలలో ఓ అమ్మాయి ఇంటర్ బైపీసీ చదువుతోంది. అయితే ఇదే కాలేజీలో కార్తీకేయ అనే టీచర్ ఫిజిక్స్ చెబుతున్నాడు. అయితే అందమైన స్టూడెంట్స్ కనిపిస్తే చాలు మనోడి బుద్ది వక్రమార్గంలోకి వెళ్లిపోతుంది. ఇదే పంథాలో వెళ్లిన ఈ ఫిజిక్స్ మాస్టార్ దారి తప్పి ఓ విద్యార్థికి ప్రేమ పాఠాలు చెప్పాడు. ఇక మెల్లగా మాయ చేసి ఆ స్టూడెంట్ ని తన ట్రాక్ లోకి దింపుకున్నాడు. దీనికి ఆ అమ్మాయి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు.
ఇక కొన్నాళ్లకు తమ కూతురు తెగ ఫోన్ లో బిజీగా ఉండడంతో తల్లిదండ్రులు ఏంటని ప్రశ్నించారు. దీంతో భయంతో ఊగిపోయిన ఆ విద్యార్థి ఇదే విషయాన్ని మాస్టార్ కు కాదు కాదు.. తన ప్రియుడికి చెప్పింది. దీంతో ఏం చేయాలో అర్థంకాని ఈ లెక్చరర్ ఏకంగా ఎగరేసుకుపోవడానికే స్కెచ్ వేశాడు. అనుకున్నట్లుగానే మందలించిన మరుసటి సాయంత్రమే ఇద్దరు కనిపించకుండా పోయారు. దీంతో తమ కూతురు ఇంటికి రాలేదని ఎదురు చూసి కాలేజీలో తెలిపారు.
మీరు ఈ క్రైమ్ వార్తలు చదివారా?
దీంతో అక్కడ కూడా వీరికి ఎలాంటి సమాచారం దొరకకపోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానిక పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. విద్యా బుద్దులు నేర్పాల్సిన ఓ గురువు ఏకంగా దారి తప్పి ప్రేమ పాఠాలు చెప్పి బరితెగించి ప్రవర్తించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.