కూలుతున్న కాపురాలు, గాల్లో కలుస్తున్న ప్రాణాలు, పెరుగుతున్న నేరాలు, చితికి పోతున్న బ్రతుకులు. వీటన్నింటికి ప్రధాన కారణం అక్రమ సంబంధాలు. కట్టుకున్న వాళ్లను కాదని క్షణకాల సుఖం కోసం పాకులాడటం.. మొదటికే మోసం తెస్తోంది. అలాంటి కోవకు చెందిన ఓ మహిళదే ఈ కథ. కుటుంబం కోసం విదేశంలో భర్త కష్టపడుతుంటే.. ప్రియుడి మోజులో భర్తనే నిర్లక్ష్యం చేసింది. కట్టుకున్న వాడితో హలో అనే టైమ్ లేదు గానీ, ఉంచుకున్న వాడికి మాత్రం వీడియో కాల్ లో అన్నీ చూపిస్తూ సంబర పడింది. అక్కడితో ఆగకుండా.. ప్రియుడు తనని పట్టించుకోవడం లేదంటూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో జరిగింది. సుబ్రమణ్యన్(45), మీనా దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది. వయసులో ముగ్గురూ చిన్నవాళ్లే. కుటుంబ పోషణ నిమిత్తం సుబ్రమణ్యన్ విదేశాల్లో ఉపాధి కోసం వలస వెళ్లాడు. నెలనెలా మీనాకు డబ్బు పంపిస్తూ వారికి ఏ లోటు రాకుండా చూసుకునేవాడు. భర్త విదేశాలకు వెళ్లగానే మీనా బుద్ధి పెడదోవ పట్టింది. తమ ఇంటి దగ్గర్లో ఉండే సురేష్ అనే వ్యక్తితో మీనాకు పరిచయం ఏర్పడింది. ఏదైనా అవసరం ఉంటే సురేష్ సహాయం చేస్తూ ఉండేవాడు. వారి మధ్య పరిచయం పెరిగింది. ఆ పరిచయం ప్రేమ, మోహం, తాపం వంటి పర్యాయ పదాలకు దారి తీసింది.
మీనా- సురేష్ ల మధ్య బంధం మరింత బలపడింది. సురేష్ ఏ పని లేకుండా గాలికి తిరుగుతున్నాడని తెలిసి మీనా ఎంతో బాధ పడింది. తన భర్త పంపిన డబ్బులో రూ.2 లక్షలు సురేష్ కు ఇచ్చి విదేశాలకు వెళ్లి సెటిల్ అవ్వు అని సాయం చేసింది. సురేష్ విదేశాలకు వెళ్లిపోయాడు. సురేష్ తో మీనా కామ కలాపాలు అన్నీ ఇప్పుడు ఆన్ లైన్ లోకి మారిపోయాయి. భర్తతో ఫోన్ మాట్లాడినా లేకపోయినా.. సురేష్ తో మాత్రం వీడియో కాల్ మాట్లాడాల్సిందే. అది కూడా వివస్త్రగా.. అదేం పోయే కాలమో. మాట్లాడుకోవడమే కాకుండా.. ఇద్దరూ నగ్నంగా వీడియోకాల్ మాట్లాడిన దానిని మీనా తన ఫోన్ లో రికార్డు కూడా చేసుకుంది. బాగా మిస్ అయ్యినప్పుడు చూసుకోవాలనుకుందో.. లేక ఎప్పుడైనా సంతోష్ అడ్డం తిరిగితో నిలదీయాలనుకుందో మరి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
రోజులు గడుస్తున్న కొద్దీ సురేష్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. అతను మెల్లగా మీనాను పట్టించుకోవడం మానేశాడు. అతనే సర్వస్వం అనుకుని భర్తను సైతం పెడచెవిన పెడుతున్న మీనాకు ఆ విషయం రుచించలేదు. రోజూ సురేష్ కామవాంఛలు తీర్చుకోవడానికి ఫోన్ చేసే మీనా.. ఇంక గొడవ పడేందుకు ఫోన్ చేయడం మొదలు పెట్టింది. ఎంతకీ సురేష్ లొంగక పోవడంతో.. తానిచ్చిన రూ.2 లక్షలు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసింది. అసలు సంతోష్ కు అలాంటి ఉద్దేశం కూడా లేదు కాబట్టి.. మీనా వార్నింగ్ ను లైట్ తీసుకున్నాడు. డబ్బు కోసం సురేష్ ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులను నిలదీశింది. వాళ్లు మీనాను మెడ పట్టుకుని గెంటేశారు. అసలు నువ్వెవరు.. మేము డబ్బివ్వడం ఏంటని ప్రశ్నించారు. అవమానం భరించలేక మీనా ఇంటికి వెళ్లి ఉరిపోసుకుని చనిపోయింది.
విషయం తెలిసి సుబ్రమణ్యన్ గుండెపగిలేలా విలపించాడు. ఎలాగైనా భార్యను చివరి చూపు చూసుకోవాలని తాపత్రయ పడ్డాడు. కానీ, అతనికి సమయానికి వచ్చేందుకు కుదర లేదు. బంధువులే మీనాకు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆ తర్వాత సుబ్రణ్యన్ ఇంటికి చేరుకున్నాడు. తన పిల్లలను దగ్గరకు తీసుకుని కన్నీరుమున్నీరయ్యాడు. అయితే సురేష్ కుటుంబం మీనాను అవమానించిందని బంధువుల ద్వారా తెలుసుకున్నాడు. మీనా ఫోన్ ఓపెన్ చెయ్యగా దానిలో సెల్ఫీ వీడియో ఉంది. అంతేకాదు సురేష్- మీనా ఆన్ లైన్ సాగించిన కామ కలాపాలు, చేసిన చాటింగ్ అన్నీ చూసి సుబ్రమణ్యన్ గుండె పగిలినంత పనైంది. ఆ సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుబ్రమణ్యన్ ఫిర్యాదుతో సురేష్ కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేసి.. విచారణ మొదలు పెట్టారు.
ఈ ఘటనలో తప్పు ఎవరిది? తన సుఖం కాదు.. కుటుంబ బాధ్యతే ముఖ్యం అని విదేశాలకు వెళ్లిన సుబ్రమణ్యన్ దా? కట్టుకున్న భర్త కాదు.. కోరిక తీర్చే సురేష్ ముఖ్యమనుకున్న మీనాదా? తన పబ్బం గడుపుకునేందుకు సాటి మగాడి కాపురాన్ని కూల్చేసిన సంతోష్ దా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.