జీవితం అంటే కేవలం సుఖంగా సాగే ప్రయాణం మాత్రమే కాదు. అప్పుడప్పుడు కష్టాలుకు కూడా పలకరిస్తాయి. ఏ స్థాయిలో అంటే నరకం అంటే ఇలా ఉంటుంది అనే విధంగా. అలాంటి కష్ట సమయాల్లో భాగస్వాములిద్దరు ఒకరినొక్కరు అర్ధం చేసుకోని, భరోసాగా ఉండాలి. ఎన్ని సమస్యలు వచ్చినా ఇద్దరు కలిసినడుద్దాం..వాటిని కలిసి పరిష్కరించుకుందాం అని బలంగా నమ్మితే… అలాంటి దంపతులు జీవితంలో విజయం సాధించినట్లే. వ్యాపారంలో వచ్చిన ఓ నష్టం, అనంతరం దంపతుల మధ్య ఓ చిన్న గొడవ, క్షణికావేశంలో తీసుకున్న ఓ నిర్ణయంతో ఓ అందమైన కుటుంబం అనే భవనం కూలింది. చిన్నారులతో సహా అందరూ ఆత్మహత్య చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే….సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం గార్లపల్లికి చెందిన చంద్రకాంత్(38)కు లావణ్య(32)తో కొన్నేళ్ల క్రితం విహవాం జరిగింది. వారి ప్రథమ్(6), సర్వజ్ఞ(3) అనే ఇద్దరు పిల్లలు. చంద్రకాంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వీరు వ్యాపారం కోసం బీహెచ్ఈఎల్ లో నివాసం ఉంటున్నారు.ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చంద్రకాంత్ కు నష్టాలు వచ్చాయి. ఈ విషయమై చంద్రకాత్, లావణ్యల మధ్య కొద్దికాలంగా గొడవలు జరుగుతున్నాయి. అదే క్రమంలో గురువారం రాత్రి వీరిద్దరు మరొకసారి గొడవపడ్డారు.
దీంతో ఆవేశంగా లావణ్య తన ఇద్దరు పిల్లలతో సహా ఇంటి నుంచి వెళ్లింది. భార్య తనను వదలి వెళ్లడంతో మనస్తాం చెందిన కాంత్..ఉరివేసుకోని ఆత్మహత్య చేసకున్నాడు. భర్త మరణ వార్త తెలిసి లావణ్య కూడా పిల్లలతో సహా ఆందోల్ లోని పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఏది ఏమైనా క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయంతో కుటుంబం నాశనమైంది. అభంశుభం తెలియని ఆ చిన్నారులకు.. పెద్దల నిర్ణయంతో నిండు నూరేళ్లు నిండాయి. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.