చాలా మంది తల్లిదండ్రులు తమకు అబ్బాయే కావాలని కోరుకుంటారు. పుత్రుడు పుడితే వారిని పున్నామ నరకం నుంచి కాపాడుతాడని వారి నమ్మకం. కానీ, ఇలాంటి కుమారులను కంటే.. బతికుండగానే నరకాన్ని ప్రత్యక్షంగా చూపిస్తారు. కన్నతల్లి కంటే ఇతనికి ఆస్తే ఎక్కువైంది. అందుకోసం కట్టుకున్న భార్యను పుట్టింటికి పంపి మరీ స్కెచ్ వేశాడు. కానీ, చిన్న లాజిక్ వల్ల దొరికేశాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. ఈ దారుణం సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం పోతులబొగుడలో జరిగింది. భర్త చనిపోయాక.. మొండి మల్లమ్మ(50) తన పుత్రుడు మురళి వద్దే ఉంటోంది. భర్త పేరుమీద ఉన్న నాలుగు ఎకరాల భూమి మల్లమ పేరిట రికార్డుల్లోకి ఎక్కింది. ఎప్పుడైతే ఆమె పేరిట భూమి ఎక్కిందో.. అప్పటనుంచి మురళి ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. ఆ భూమి తన పేరు మీద రాయాలంటూ ఒత్తిడి మొదలు పెట్టాడు. అంతేకాకుండా మల్లమ్మ దగ్గరున్న బంగారం కూడా ఇవ్వాలంటూ రోజూ తాగొచ్చి గొడవ చేసేవాడు.
గతంలో తాగుడు కోసం రెండెకరాల భూమిని మురళి అమ్మేశాడు. ఇప్పుడు ఇది కూడా తాగుడుకు తగలేస్తాడనే భయంతో ఆమె నిరాకరించింది. అదే ఆమె పాలిట శాపంగా మారింది. చెప్తే విటాడులే అనుకుని రోజూ ఆస్తి గురించి అడిగినప్పుడల్లా నువ్వు పాడుచేస్తావు.. నేను చనిపోతే అది ఎలాగూ నీకేగా వచ్చేది అని చెప్పుకొచ్చింది. తన తల్లిపోతే ఆ భూమి తనకే దక్కుతుందనే విషయం మురళి మనసులో గట్టిగా నాటుకుంది. ఎలాగైన తల్లిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
అనుకున్నదే తడవుగా భార్యను పుట్టింటికి పంపాడు. ఇంట్లో ఉన్న తల్లిని గొంతు నులిమి హతమార్చాడు. పైగా ఎవరికీ అనుమానం రాకుండా తన తల్లి అనారోగ్యంతో మరణించినట్లు చెప్పాడు. అతని వ్యవహారంపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కటకటాల పాలైన మురళి తల్లినే కాదు.. ఆస్తిని కూడా పోగొట్టుకున్నాడు. ఇలాంటి కొడుకుల్ని కనడం కంటే పిల్లలు లేకుండానే ఉండటం మంచిదని కామెంట్ చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.