తెలంగాణలోని సంగారెడ్డిలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని జిన్నారం మండలం వావిలాల శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఓ ఫాంహౌస్‌లో ఎయిర్‌గన్ పేలి ఒక బాలిక మృతిచెందింది. శబ్దం విన్న స్థానికులు అక్కడికి చేరుకోని పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జిల్లాలోని జిన్నారం మండలం వావిలాల శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో పనిచేస్తున్న ఓ వ్యక్తి కుమార్తె శాన్వి(4) ఎయిర్‌గన్ పేలి తీవ్ర గాయాలపాలైంది. వెంటనే చిన్నారిని గడ్డిపోచారంలోని ఓ ఆర్‌ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా తాను చికిత్స చేయలేనని.. చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వెంటనే పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో బాలికను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఇది చదవండి: జోగిని శ్యామలకు వేధింపులు.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు!
నిజామాబాద్ జిల్లాకి చెందిన నాగరాజు కుటుంబంతో సహా వచ్చి గత కొద్దిరోజులుగా ఈ ఫామ్ హౌస్‌లో పనిచేస్తున్నట్లు పేర్కొంటున్నారు. కోతులను, కొంగలను తరమాడానికి ఈ ఏయిర్ గన్‌ను వాడుతున్నట్లు ఫాం హౌస్ సిబ్బంది పేర్కొంటున్నారు. అయితే ఎవరైనా కాల్చారా..? లేక పిల్లలు ఆడుకుంటుండగా గన్ పేలిందా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జిన్నారం పోలీసులు తెలిపారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.