ఈ మధ్యకాలంలో కామంతో కళ్లు ముసుకుపోయిన కొందరు వ్యక్తులు అత్యాచారయత్నానికి పాల్పడుతున్నారు. ఇటు గాలిగా తిరిగే యువకుల నుంచి బాధ్యత గల ఉద్యోగం చేస్తున్న అధికారుల వరకు కొందరు కీచక లెక్కలు ప్రయోగిస్తున్నారు. అయితే తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఓ బాధ్యత గల కానిస్టేబుల్ అభం శుభం తెలియని ఓ చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ శివారు శంకర్ పల్లిలోని నివాసం ఉంటున్న వడ్డే శేఖర్ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. అయితే తాజాగా ఇంటి పక్కన ఉండే ఓ చిన్నారిపై శేఖర్ అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే వెంటనే ప్రతిఘటించిన ఆ బాలిక అరుపులు, కేకలు వినపించడంతో స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇక యువకులంతా నిందితుడు వడ్డే శేఖర్ చితకబాదారు. ఇక పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసుకున్నారు. అయితే బుధవారం చేవెళ్ల ఏసీపీ కార్యాలయానికి తీసుకెళ్లిన పోలీసులు విచారణ అనంతరం నిందితుడు శేఖర్ పై అత్యాచారయత్నం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యత గల ఉద్యోగంలో ఉండి ఇలాంటి ఖాకి లెక్కలకు పాల్పడిన కానిస్టేబుల్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.