ఏపీలోని రాజమండ్రిలో దారుణ హత్య చోటు చేసుకుంది. ఇటీవల స్నేహితుడు మందలించాడనే నెపంతో మరో స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకంగా మారింది. ఇక అంతటితో ఆగకుండా అదే శవాన్ని ఇంట్లో పెట్టుకుని రోజుకొక భాగాన్ని కోసి కాల్చడం మొదలు పెట్టడు. ఎట్టకేలకు విషయం బయటకు పొక్కడంతో సంచలన నిజాలు బయటపడ్డాయి.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది రాజమండ్రిలోని ఆర్యపురం గ్రామం. నాగసాయి అలియాస్ వెంకటేష్, సాయిపవన్ ఇద్దరు స్నేహితులు. వీరిద్దరికి కూడా తల్లిదండ్రులు లేకపోవడంతో కోలమూరులో ఓ గదిలో నివాసం ఉంటూ పురోహిత్యం నేర్చుకుంటున్నారు. అయితే గత కొంత కాలం నుంచి సాయి పవన్ చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బును వృధాగా ఖర్చుపెడుతున్నాడు. దీంతో కోపంతో వెంకటేష్ సాయి పవన్ ను మందలించాడు. ఆగ్రహంతో ఊగిపోయిన పవన్ అతనిపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైన వీడిని హత్య చేయాలని భావించి అనుకున్నట్లుగానే మరో స్నేహితుడి సాయంతో హత్య చేశాడు. ఇక ఆ శవాన్ని ఏం చేయాలో అర్థం కాక 11 రోజులు ఇంట్లోనే పెట్టుకున్నాడు.
అలా రోజుకొక భాగాన్ని ముక్కలుగా వేరు చేసి ఇంట్లోనే దహనం చేయటం మొదలు పెట్టాడు. పవన్ అద్దె ఇంటి నుంచి స్థానికులకు దుర్వాసన రావడంతో ఏంటా అని పవన్ ను నిలదీశారు. చెప్పకపోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూస్తే సగం కాలిన శవం కనిపించే సరికి పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. సాయి పవన్ పై అనుమానం రావడంతో పోలీసులు ప్రశ్నించారు. భయంతో మనోడు చేప్పిన నిజాలకు పోలీసులే ఖంగుతిన్నారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా కోలమూరులో జరిగిన ఈ సంచలన ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా
మారింది.