నవమాసాలు మోసేది తల్లి.. ఉగ్గుపోసి అల్లారుముద్దుగా పెంచేది తల్లి.. ఏ చిన్న కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడేది తల్లి.. చందమామ రావే జాబిల్లి రావే అంటూ గోరుముద్దలు తనిపించేది తల్లి. కానీ, ఈ తల్లి మాత్రం ఆ కోవకు చెందింది కాదు. కన్నపేగు బంధాన్ని కాల రాసింది. ఇటీవల ఓ మహిళ తాను చనిపోయినా పర్లేదు.. నా బిడ్డ ఈ లోకాన్ని చూడాలి అని ప్రాణత్యాగం చేసింది. ఈ తల్లి మాత్రం నాతోపాటే నా పిల్లను ఈ భూమిమీద నుంచి తీసుకుపోతానంటూ దారుణానికి ఒడిగట్టింది. కడుపున పుట్టిన బిడ్డలను కర్కశంగా నీళ్ల తొట్టిలో ముంచి హతమార్చింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. కుళితురై సమీపంలోని కలువన్ దిట్టకాలనీకి చెందిన జబషైన్ కేరళలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతనికి విజీ(27)తో వివాహం జరిగింది. వారికి ప్రియ(రెండేళ్లు), ఆరునెలల వయసున్న ఇద్దరు ఆడపిల్లలున్నారు. జడుషైన్ కేరళో పని చేస్తున్నందున విజీతో పాటు ఆమె అత్త నివాసముంటోంది. పిల్లలను చూసుకునేందుకు అత్త చేదోడువాదోడుగా ఉండేది.
మంగళవారం అత రాజమ్మాల్ గుడికి వెళ్లింది. వచ్చి చూసేసరికి ఇంట్లోని నీటితొట్టిలో చిన్నారుల మృతదేహాలు తేలుతూ కనిపించాయి. వెంటనే ఇరుగుపొరుగు వారిని పిలిచింది. అంతా వచ్చిచూసేసరికి ఇంట్లో విజీ ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. ఆమె ఇద్దరు చిన్నారులను తొట్టిలో ముంచి హత్య చేసి.. తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ, ఆమె అంతటి దారుణానికి ఒడిగట్టాల్సిన అవసరం ఏంటనేది అర్థం కాని ప్రశ్న. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారణం ఏదైనా కావచ్చు కానీ, ముక్కుపచ్చలారని ఆ చిన్నారులను అలా తొట్టిలో ముంచి హత్య చేయడాన్ని మాత్రం స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: దారుణం.. ఇంటర్మీడియట్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం!