‘స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా.. స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా.. కడదాక నీడలాగ నిను వీడిపోదురా’ అన్న పాట గుర్తుంది కదా.. ప్రపంచంలో అయినొళ్ల కన్న ఆత్మీయుడే మిన్న అనేవారు చాలా మంది ఉంటారు. కొంత మంది స్నేహం కోసం తమ ప్రాణాలు కూడా లేక్కచేయరు.. కొన్ని సార్లు తమ ఆత్మీయులు కన్నుమూశారన్న వార్త విని గుండె పగిలి చనిపోయిన వారూ ఉన్నారు. రోజు కూలీ చేసుకుంటూ వచ్చినదాంట్లో తమ కుటుంబాన్ని ఆనందంగా చూసుకుంటున్న ఇద్దరు స్నేహితులు అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరూ చనిపోయారు. మరణంలోనూ ఇద్దరు స్నేహితుల బంధం విడిపోలేదు.
ఇది చదవండి: బిగ్ బాస్ తెలుగు ఓటీటీ లోగో రిలీజ్. ఇకపై నాన్‌స్టాప్ ఎంటర్టైన్‌మెంట్!
పోలీసులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. కావేటి మహేందర్ (28), నిజాముద్దీన్(30) రోజు కూలీలుగా కామారెడ్డి లో మేస్త్రి పని పూర్తి చేసుకొని రాత్రి 12 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు బైక్ పై నుండి జారిపడ్డారు. ప్రమాదం జరిగిన చోటే కావేటి మహేందర్ మృతి చెందగా.. నిజాముద్దీన్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రాణ స్నేహితులు ఇద్దరూ ఒకేసారి చనిపోవడంతో బసవన్న పల్లి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
మృతుడు మహేందర్ కు ఇద్దరు పిల్లలు, నిజాముద్దీన్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటిపెద్ద దిక్కును కోల్పోయామని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.