ప్రేమ గుడ్డిదే కావచ్చు.. కానీ వాళ్లు ప్రేమిస్తున్న వ్యక్తి ఎలాంటి వాడు? అతనితో మన జీవితం ఎలా ఉంటుంది? అతని వ్యక్తిత్వం మంచిదేనా? నిజంగానే ప్రేమిస్తున్నాడా? అవసరం తీర్చుకోవాలని చూస్తున్నాడా? అనేది తెలుసుకోకుండా సర్వం అర్పించి చివరికి మోసపోయామంటూ పోలీసులను ఆశ్రయిస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే భార్య కథ కూడా అలాంటిందే. మంచివాడని నమ్మి ప్రేమించింది. పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతో అన్నీ అర్పించుకుంది. కానీ, అతనో కిరాతకుడని తెలుసుకునేలోపే ఆమె జీవితం మొత్తం నాశనం అయిపోయింది. బలవంతం మీద పెళ్లి చేసుకుని నరకం చూపిచండం మొదలు పెట్టాడు. పడక గదిలోని వీడియోలు మొత్తం సోషల్ మీడియాలో పెట్టి ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు. బతికుండగానే కదల్లేని జీవచ్ఛవంగా మార్చేశాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా రాయచోటికి చెందిన యువతికి అదే ప్రాంతానికి చెందిన ఓ చికెన్ షాపు యజమానితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతో సర్వం అర్పించుకుంది. ఆమెతో చనువుగా ఉన్నప్పుడు వీడియోలు తీశాడు. ఆమెను నగ్నంగా కూడా ఫొటోలు తీశాడు. తనవాడే కదా అని అందుకు ఓకే చెప్పింది. కొన్నాళ్లకు ఆమె గర్భం దాల్చింది. తర్వాత పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసింది. అప్పుడే పెళ్లి ఎందుకు అంటూ మాయమాటలు చెప్పి అబార్షన్ చేయించాడు.
ఆ తర్వాత ఎప్పుడు పెళ్లి టాపిక్ తెచ్చినా కూడా.. ఆమె నగ్న వీడియోలు చూపిస్తూ ఆమెను బెదిరించడం మొదలు పెట్టాడు. కొన్నాళ్లు అలాగే మౌనంగా ఉండిపోయిన ఆ యువతి.. తర్వాత పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వాళ్లిద్దరికీ పెళ్లి జరిపించారు. బుద్ధిగా ఉండమని అతనికి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత నుంచి ఆమెకు నరకాన్ని ప్రత్యక్షంగా చూపించసాగాడు. వాళ్లిద్దరి వీడియోలను ఫేక్ అకౌంట్ల ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆమెను తీవ్రంగా కొట్టడంతో నడవలేని స్థితికి చేరుకుంది. బతికుండగానే జీవచ్ఛవంగా మార్చేశాడు.
ఇదీ చదవండి: భర్త ఉండగా ప్రియుళ్లతో బరితెగించిన భార్య.. క్లైమాక్స్ లో షాకింగ్ సీన్!
ఎలాగైన ఆ మృగాడికి బుద్ధి చెప్పాలని మంగళగిరి వెళ్లి రాష్ట్ర డీజీపీని కలిసింది. తన కష్టాలను మొత్తం చెప్పుకుంది. ఆమె ఫిర్యాదుపై స్పందించిన డీజీపీ కడప ఎస్పీ కార్యాలయానికి సమాచారం అందించారు. అతడిని కఠినంగా శిక్షించాలంటూ ఆ యువతి డిమాండ్ చేసింది. కడప పోలీసులు ఇంకా స్పందించలేదు. ఇంతటి కిరాతకానికి పాల్పడిన వ్యక్తిని ఎంత కఠినంగా శిక్షించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.