హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో వ్యభిచార ముఠాలు చడి చప్పుడు కాకుండా వ్యభిచారం నడిపిస్తున్నాయి. తాజాగా బొయిన్ పల్లిలోని కంటోన్మెంట్ పరిధిలోని ఓ అపార్ట్ మెంట్ లో హైటెక్ వ్యభిచారాన్ని నడిపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వీరి గుట్టును రట్టు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వ్యభిచారం గృహ నిర్వాహకుడు ఎండీ అజీజ్, ప్రదీప్, విటుడు సుబ్రహ్మణ్యంతో పాటు ఓ మహిళను అరెస్ట్ చేశారు. ఇక నిందితుల నుంచి మూడు సెల్ ఫోన్లు, రూ4 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.