నేటి సమాజంలో వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వీటి కారణంగా హత్యలు, ఆత్మహత్యలు బాగా పెరిగి పోతున్నాయి. ముఖ్యంగా భాగస్వామికి తెలియకుండా మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంటున్నారు. ఇప్పటికే ఈ అక్రమ సంబంధాల కారణంగా ఎందరో బలయ్యారు. తాజాగా మరో వివాహిత ఈ వివాహేతర సంబంధానికి బలైంది.
నేటి సమాజంలో వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వీటి కారణంగా హత్యలు, ఆత్మహత్యలు బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా భాగస్వామికి తెలియకుండా మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంటున్నారు. కొందరు పది నిమిషాల పరాయి సుఖం కోసం పచ్చని సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భాగస్వామిని కడతేర్చేందుకు కూడా కొందరు వెనుకాడటం లేదు. ఇప్పటికే ఈ అక్రమ సంబంధాల కారణంగా ఎందరో బలయ్యారు. తాజాగా మరో వివాహిత ఈ వివాహేతర సంబంధానికి బలైంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని నిద్రలో ఉన్న భార్యను భర్త చంపేశాడు. ఈ దారుణ ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
విజయనగరం జిల్లా కొత్తవలస దరి రామలింగాపురానికి చెందిన శ్రీదేవి(24)కి జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో ఉంటున్న కిలాని శివతో 2017లో వివాహం అయింది. వీరికి ఐదేళ్ల బాబు, మూడేళ్ల పాప ఉన్నారు. ఇటీవల శివ జీవీఎంసీలో చెత్తను తరలించే క్లాప్ వాహనం డ్రైవర్ గా శివ చేరాడు. చాలా కాలంపాటు వీరి సంసారం ఎంతో హాయిగా సాగింది. అయితే ఇటీవల గోపాలపట్నం దరి కొత్తపాలెంకి చెందిన మరో యువతితో శివకు పరిచయం ఏర్పడింది. ఆమెతో స్నేహంలో పడి భార్యను పట్టించుకోవడం మానేశాడు. దీంతో కుటుంబంలో తరచు తగాదాలు జరుగున్నాయి.
యువతి విషయాన్ని శ్రీదేవి.. తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పలుమార్లు శివను మందలించారు. ఈ క్రమంలో శుక్రవారం శ్రీదేవిని చంపేసి శివ, అతడి తల్లి ఓ కొత్త నాటకాన్ని ఆడారు. అకస్మాత్తుగా చనిపోయిందని అందర్ని నమ్మించడమే కాకుండా శివ, అతడి తల్లి కలిసి శ్రీదేవి గోపాలపట్నంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వాళ్లు వచ్చి గట్టిగా నిలదీసి.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. తన కుమార్తెను వదిలించుకోవడానికి ఇలా చేశాడని వారికి తగిన శిక్ష విధించాలని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు.
“ఇటీవలే శ్రీదేవి తనతో ఫోన్ తో మాట్లాడుతూ.. అమ్మా మీ అల్లుడిలో మార్పు వచ్చింది.. ఇక నా గురించి మీరు బెంగ పడాల్సిన పని లేదని చెప్పిందని.. అలా చెప్పిందని సంతోషించిన కొద్దిరోజులకే ఇలా విగత జీవిగా మారింది” అని మృతురాలి తల్లి వాపోయింది. పరాయి వారితో శరీర సుఖం కోసం తన వెంట ఏడడుగులు నడించిన భార్యను కడతేర్చాడు ఈ దుర్మార్గుడు అని స్థానికులు అంటున్నారు. అతడు చేసిన ఈ దారుణానికి ఇద్దరు చిన్నారులు తల్లిలేని పిల్లలుగా మారారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.