గుట్టచప్పుడు కాకుండా సిటీలో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజేంద్రనగర్ పరిధిలో హైటెక్ వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం మేరకు శుక్రవారం రాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు విటులతో పాటు నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్నేహితుల ద్వారా మొబైల్ ఫోన్లలో యువతుల ఫోటోలను ఎరవేసి నిర్వాహకుడు విటులను ఆకర్షిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళలను రిస్కీ హోంకు తరలించారు.