నేటికాలంలో చాలా మందిలో సహనం, ఓర్పు లేకుండా పోతుంది. ప్రతి చిన్న విషయానికి కోపం, చిరాకు పడుతుంటారు. మరికొందరు అయితే దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఏదైన గొడవ జరిగితే సహనం కోల్పోయి క్షణికావేశంలో ప్రాణాలు తీసేస్తున్నారు. అలా క్షణికావేశంలో వచ్చే కోపం కారణంగా కొందరి ప్రాణలు పోతుండగా మరికొందరు జైలు జీవితం అనుభవిస్తున్నారు. తాజాగా ఓ యువకుుడ చిన్న విషయానికి సహనం కోల్పోయి ఓ నిండు ప్రాణాన్ని తీశాడు. తాగడానికి సిగరెట్ ఇవ్వలేదని తన స్నేహితుడిని దారుణంగా చంపేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాకు చెందిన కప్తాన్ సింగ్, సుహైల్ ఖాన్ లు ఇద్దరు మంచి స్నేహితులు. ఎక్కడికి వెళ్లిన కలిసే వెళ్లేవారు. వీరికి సిగరెట్ తాగే అలవాటు ఉంది. అప్పుడప్పుడు సమీపంలోని కోట వద్దకు వెళ్లి సిగరెట్ తాగేవారు. అలానే శుక్రవారం సాయంత్రం కూడా సిగరెట్ కాల్చేందుకు వీరిద్దరూ కోట వద్దకు వెళ్లారు. అక్కడ గోడపై కూర్చుని సిగరెట్ తాగుతున్నారు. ఈక్రమంలో ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వదం జరిగింది. గాలివానాల మొదలైన వీరి గొడవ తుఫాన్ లా మారింది. ఒకరిపై మరొకరు భౌతిక దాడికి సైతం దిగారు.
ఇదే సమయంలో సహనం కోల్పోయిన సుహైల్ ఖాన్..తన స్నేహితుడైన కప్తాన్ సింగ్ ను 30 అడుగుల లోతున్న గుంతలోకి తోసేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. అయితే వీరిద్దరి కోట్లాటను చూసిన స్థానికులు అక్కడి చేరుకున్నారు. అక్కడ తీవ్రంగా గాయపడిన కప్తాన్ సింగ్ ను వారు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి కప్తాన్ సింగ్ మరణించాడు. చనిపోయే ముందు సోదరుడికి ఫోన్ చేసిన కప్తార్ సింగ్.. తనను సుహైల్ గుంతలోకి తోసేశాడని చెప్పాడు. కప్తాన్ సింగ్ సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. సుహైల్ ను అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో ఆసక్తికరమైన విషయాలు సుహైల్ వెల్లడించాడు. తాము గొడవ పడిన సమయంలో ఇద్దరం మత్తులో ఉన్నామని తెలిపాడు. అంతేకాక సిగరెట్ ఇవ్వమని చాలా సార్లు కప్తాన్ సింగ్ ను అడిగానని, ఎంతసేపటి ఇవ్వకుండా విసిగించాడని అన్నాడు. సిగరేట్ ఇవ్వకపోవడంతో ఆవేశంలో కోట గోడపై నుంచి తోసేశానని పోలీసులు ఎదుట సోహైల్ ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై కేసుపై నమోదు చేసిన పోలీసులు సోహైల్ ఖాన్ ను రిమాంండ్ కు తరలించారు. మత్తు పదార్ధలు, మనిషిలోని ఆవేశం ఇలాంటి దారుణాలకు ప్రేరిపిస్తాయి. క్షణికావేశం రెండు నిండు జీవితాలు నాశనం చేసింది.